AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ: నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ ఎంపీల భేటీ.. రాహుల్‌గాంధీ నేతృత్వంలో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర‌

Farmer protests: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు గురువారం ఉద‌యం 10.45 గంట‌ల‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు...

ఢిల్లీ: నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ ఎంపీల భేటీ.. రాహుల్‌గాంధీ నేతృత్వంలో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర‌
Subhash Goud
|

Updated on: Dec 24, 2020 | 6:58 AM

Share

Farmer protests: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు గురువారం ఉద‌యం 10.45 గంట‌ల‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షల సంతకాల ప్రతులను రాష్ట్రపతికి అందజేయనున్నారు. కొత్త చట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఈ సంత‌కాలు సేక‌రించింది. కాగా, రాహుల్ గాంధీ కాలినడకన రాష్ట్రపతి భవనానికి వెళ్లనున్నారు. విజ‌య్ చౌక్ నుంచి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌నున్నారు.

కాగా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ దేశ రాజ‌ధానిలోని శివారులో రైతుల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. రోజుకో త‌ర‌హాలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు. కేంద్రం కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించినా.. కొత్త చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌న్న ప్ర‌ధాన డిమాండ్‌తో ఆందోళ‌న కొన‌సాగుతోంది. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీల బృందం రాష్ట్ర‌ప‌తితో స‌మావేశం కానుంది.

అలాగే పంజాబ్‌, హ‌ర్యానాకు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నుంచి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర‌గా వెళ్ల‌నున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలంద‌రూ ఢిల్లీకి రావాల్సిందిగా వారు కోరారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎంపీల‌కు కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వ‌చ్చింది.

రైతు చట్టాలకు మద్దతుగా యూపీ నుంచి ఢిల్లీకి 20 వేలమందికి పైగా అన్నదాతల ర్యాలీ, హర్యానా, ఉత్తరాఖండ్ నుంచి కూడా !

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు