Parliament Budget Sessions: ‘వైట్‌ పేపర్‌ కాదు..బ్లాక్‌ బార్స్‌’.. శ్వేత పత్రంపై కాంగ్రెస్ ఎంపీ కౌంటర్..

ఢిల్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై లోక్‌సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. నాలుగు గంటలపాటు కొనసాగిన చర్చలో యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ దివాలతీసిన వైనంపై అంకెలతో సహా వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఆ తర్వాత విపక్ష కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌తివారీ.. నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను ఖండించారు.

Parliament Budget Sessions: వైట్‌ పేపర్‌ కాదు..బ్లాక్‌ బార్స్‌.. శ్వేత పత్రంపై కాంగ్రెస్ ఎంపీ కౌంటర్..
Congress Mp Manish Tiwari

Updated on: Feb 09, 2024 | 2:03 PM

ఢిల్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై లోక్‌సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. నాలుగు గంటలపాటు కొనసాగిన చర్చలో యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ దివాలతీసిన వైనంపై అంకెలతో సహా వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఆ తర్వాత విపక్ష కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌తివారీ.. నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను ఖండించారు.

2004లో యూపీఏ సర్కార్‌ అధికారంలోకి వచ్చే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధిరేటుతో ఉందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌. అలాంటిది కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని విమర్శించారామె. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అయిదో స్థానానికి తీసుకొచ్చిందని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. లోక్‌సభలో వైట్‌ పేపర్‌పై నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి. ఇది వైట్‌ పేపర్‌ కాదు..బ్లాక్‌ బార్స్‌ అని విమర్శించారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే శ్వేతపత్రం అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయితే దీనిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి