AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇది జాతీయ నిరుద్యోగ దినోత్సవం’, కాంగ్రెస్

ప్రధాని మోదీ 70 వ జన్మ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయనకు ఇతర నేతల మాదిరే కాంగ్రెస్ పార్టీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ..అభినందిస్తూనే, మరోవైపు దేశంలోని సమస్యలను ప్రస్తావించింది.

'ఇది జాతీయ నిరుద్యోగ దినోత్సవం', కాంగ్రెస్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 17, 2020 | 4:14 PM

Share

ప్రధాని మోదీ 70 వ జన్మ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయనకు ఇతర నేతల మాదిరే కాంగ్రెస్ పార్టీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ..అభినందిస్తూనే, మరోవైపు దేశంలోని సమస్యలను ప్రస్తావించింది. మోదీ బర్త్ డే ని ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’ గా యువత వ్యవహరించాలని ఈ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.ఉపాధి, ఉద్యోగం అన్నవి గౌరవానికి ప్రతిబింబమని, ప్రభుత్వం దీన్ని ఎంతోకాలం తిరస్కరించజాలదని ఆయన అన్నారు. ఇక ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, రణదీప్ సూర్జేవాలా కూడా తమ ట్వీట్లతో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  అయితే ఈ సందర్భంలో ఈ పార్టీ ఇలా విమర్శలు చేయడాన్ని పలువురు విమర్శించారు.