కాంగ్రెస్‌కి కొత్త చీఫ్ అవసరం: శశి థరూర్‌

ప్రస్తుత పరిస్థితులను చక్క బెట్టి, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌కి కొత్త చీఫ్ అవసరమని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.

కాంగ్రెస్‌కి కొత్త చీఫ్ అవసరం: శశి థరూర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 7:41 PM

Shashi Tharoor on Congress new chief: ప్రస్తుత పరిస్థితులను చక్క బెట్టి, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌కి కొత్త చీఫ్ అవసరమని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు. సోనియా గాంధీ ఎప్పుడూ కాంగ్రెస్ చీఫ్‌గా ఉంటూ పార్టీ బాధ్యతలను మోస్తారనుకోవడం అన్యాయం అవుతుందని ఆయన తెలిపారు. పార్టీకి ఫుల్‌ టైమ్‌ ప్రెసిడెంట్‌ను కనుగొనే ప్రక్రియను కాంగ్రెస్‌ వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

”కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకత్వంపై మేం మరింత స్పష్టంగా ఉండాలని నమ్ముతున్నా. తాత్కాలిక ప్రెసిడెంట్‌గా సోనియా జీ నియామకానికి నేను మద్దతుగా నిలిచా. కానీ పార్టీ బాధ్యతలను ఆమె ఎప్పుడూ మోయాలనుకోవడం న్యాయం కాదు. కాంగ్రెస్‌ను నడిపించే సామర్థ్యం రాహుల్‌కి ఉంది. అయితే ఆ పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరిస్తే కొత్త చీఫ్‌గా మరొకరికి ఎన్నుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉండాలి” అని శశి థరూర్ అన్నారు.

Read This Story Also: బుబోనిక్ ప్లేగు మరణం.. గ్రామాలను సీల్ చేసిన చైనా