భార‌త వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు అడ్డాగా ట‌ర్కీ విశ్వవిద్యాలయాలు

భార‌త వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు అడ్డాగా ట‌ర్కీ విశ్వవిద్యాలయాలు

ఆర్టికల్ 370 ను రద్దు చేసిన స‌మయంలో ఓవ‌ర్ యాక్ష‌న్ చేసిన‌ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన తొలి నాయకులలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఒకరు.

Ram Naramaneni

|

Aug 09, 2020 | 7:40 PM

Turkey Plans Against india : ఆర్టికల్ 370 ను రద్దు చేసిన స‌మయంలో ఓవ‌ర్ యాక్ష‌న్ చేసిన‌ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన తొలి నాయకులలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఒకరు. 2019 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా టర్కీ కాశ్మీర్ సమస్యను లేవనెత్తింది. కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం ద్వారా ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చెయ్య‌డం ద్వారా ప్రపంచ వేదికలపై కాశ్మీర్‌పై త‌మ వాద‌న‌ను బలోపేతం చేయ‌గ‌లుగుతుంది. ముస్లిం ఉమ్మా ‘ఖలీఫ్’గా మారడానికి ఎర్డోగాన్‌కు ఉప‌యోగ‌రక‌రంగా ఉంటుంది. కాశ్మీర్‌తో పాటు ‘హిందుత్వ’ విష‌యంలో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన ప్రపంచ ప్రచారానికి టర్కీ మద్దతు ఇవ్వ‌డం ద్వారా దక్షిణాసియా ముస్లింలలో ఎర్డోగాన్ స్థాయి పెరుగుతుంది. ట‌ర్కీ రాష్ట్రపతి, పార్లమెంటు సభ్యులు, ఇతర నాయకుల కాశ్మీర్ విష‌యంలో భార‌త్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు కాశ్మీర్‌పై భారత వ్యతిరేక కథనాన్ని రూపొందించడంలో టర్కీ సంస్థలు సూపర్ యాక్టివ్ పాత్ర పోషించాయి. ఇప్పుడు టర్కీ విద్యాసంస్థలు భారత వ్యతిరేక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారాయి.

భారత భద్రతా సంస్థల స‌మాచారం ప్రకారం, గత ఏడాది కాలంగా టర్కీ విశ్వవిద్యాలయాలలో భారత వ్యతిరేక కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. టర్కీలోని పాకిస్తాన్ మిషన్, పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఎన్జీఓలు, పాకిస్తాన్ ప్రాక్సీల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 2019 ఆగస్టు 5 నుంచి టర్కీ విశ్వవిద్యాలయాలలో కాశ్మీర్‌పై 30 కి పైగా సమావేశాలు,సెమినార్లు నిర్వహించిన‌ట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ ప్రాక్సీ, ప్రపంచ కాశ్మీర్ ఫోరం సెక్రటరీ జనరల్ గులాం నబీ వీటిలో అరడజను కార్యక్రమాలకు హాజరయ్యార‌ని స‌మాచారం. అంతేకాదు టర్కీలోని పాకిస్తాన్ రాయబారి సైరస్ సజ్జాద్ ఖాజీ ఇలాంటి పలు కార్యక్రమాలకు హాజరయిన‌ట్లు సమాచారం.  అతి తెలివి ప్ర‌ద‌ర్శించి కాశ్మీర్‌కు చెందిన రెబ‌ల్ విద్యార్థులు  ఈ ఈవెంట్లకు ఆహ్వానించ‌డంతో పాటు భారత వ్యతిరేక విద్యావేత్తలను ఈ కార్యక్రమాలలో వక్తలుగా ఆహ్వానిస్తున్న‌ట్లు సమాచారం.

Also Read : ల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu