టీనేజర్‌కి బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. పెట్టిన కండిషన్లు‌ తెలిస్తే షాక్‌

టీనేజర్‌కి బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. పెట్టిన కండిషన్లు‌ తెలిస్తే షాక్‌

ఓ 18ఏళ్ల టీనేజర్‌కి బెయిల్‌ ఇచ్చిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు, ఓ కండిషన్లని పెట్టింది. ఆ నిబంధనలను బేఖాతరు చేస్తే మళ్లీ జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 6:52 PM

Court conditions to 18 year old: ఓ 18ఏళ్ల టీనేజర్‌కి బెయిల్‌ ఇచ్చిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు, ఓ కండిషన్లని పెట్టింది. ఆ నిబంధనలను బేఖాతరు చేస్తే మళ్లీ జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. అయితే ఇంతకు ఆ టీనేజర్‌కి హైకోర్టు పెట్టిన కండిషన్లు ఏంటో తెలుసా. రెండు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం, ఐదు చెట్లు నాటడం. మీరు చదువుతున్నది నిజమే.

బింద్‌ జిల్లాలోని అశ్వర్ గ్రామంలో హరేంద్ర త్యాగీ అనే టీనేజర్, ‌ షాప్ కీపర్‌ని కొట్టడంతో పాటు దుర్భాషలాడాడు. దీంతో అతడిపై 323, 294, 506, 329 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు జూన్ 23న అరెస్ట్ చేశారు. ఆ తరువాత జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జూన్ 24న జైలుకు తరలించారు. ఈ క్రమంలో అతడికి బెయిల్ ఇవ్వాలని సుశాంత్‌ తివారీ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు.

”2019లో 12వ క్లాస్‌లో త్యాగీకి 75శాతం మార్కులు వచ్చాయి. అతడు ప్రీ అగ్రికల్చర్‌ టెస్ట్‌ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కరోనా వలన ఆ టెస్ట్‌ వాయిదా పడింది. ఇప్పుడు అతడికి బెయిల్ ఇవ్వకపోతే అతడి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసుపై సానుభూతిగా ఆలోచించండి. మంచిగా చదివే కుర్రాడు కాబట్టి అతడి భవిష్యత్‌ గురించి ఆలోచించి బెయిల్‌ ఇవ్వండి” అంటూ తివారీ న్యాయస్థానానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో అతడికి బెయిల్‌ మంజూరు చేసిన జస్టిస్ ఆనంద్ పటక్‌ కొన్ని కండిషన్లను పెట్టారు. రెండు నెలలు త్యాగి సోషల్ మీడియా గ్రూప్‌లకు(వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి మీడియాలు) దూరంగా ఉండాలని, ఐదు మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. ఒకవేళ సోషల్ మీడియాను వాడుతున్నట్లు తెలిస్తే, బెయిల్ క్యాన్సిల్ అవుతుందని ఈ సందర్భంగా న్యాయవాది వెల్లడించారు. త్యాగీ ప్రతి నెల తన సోషల్ మీడియాకు సంబంధించిన వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌లో సబ్‌మిట్ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా త్యాగీకి 50వేల జరిమానాను కూడా విధించారు.

Read This Story Also: చాహల్‌కి రోహిత్ కంగ్రాట్స్‌.. ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu