సుశాంత్ కేసులో రియా సోదరునికి 18 గంటల విచారణ

సుశాంత్ కేసులో రియా సోదరునికి 18 గంటల విచారణ

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా సుమారు 18 గంటల పాటు విచారించారు. ముంబైలోని ఈడీ కార్యాలయానికి శనివారం  మధ్యాహ్న ప్రాంతంలో వెళ్లిన షోవిక్..

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Aug 09, 2020 | 6:23 PM

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా సుమారు 18 గంటల పాటు విచారించారు. ముంబైలోని ఈడీ కార్యాలయానికి శనివారం  మధ్యాహ్న ప్రాంతంలో వెళ్లిన షోవిక్..ఆదివారం ఉదయం 7 గంటలకు బయటకు వచ్చాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు అతడు తప్పించుకునే సమాధానాలిచ్చినట్టు తెలుస్తోంది. అతడిని వారు ఇంటరాగేట్ చేయడం ఇది రెండో సారి. మళ్ళీ సోమవారం కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మనీ లాండరింగ్ చట్టం కింద అధికారులు ప్రశ్నించారని, అతని వ్యక్తిగత వ్యాపారం, ఆదాయం, పెట్టుబడులు,  సుశాంత్ తో గల ఆర్ధిక లావాదేవీల గురించి వారు విచారించారు. మరో వైపు రియా చక్రవర్తిని సైతం  మళ్ళీసోమవారం ఇంటరాగేట్ చేయనున్నట్టు సమాచారం. ఇదివరకే ఆమెను సుమారు 8 గంటలపాటు విచారించారు.

ఈ నెల 7 న రియాను, ఆమె తండ్రి ఇంద్రజిత్ ని, ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ ను, మాజీ బిజినెస్ మేనేజర్ శృతి మోడీని కూడా ఈడీ ప్రశ్నించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu