దేశంలోని కొన్ని జిల్లాల్లో కోవిడ్ 19 సామాజిక వ్యాప్తి, అంగీకరించిన కేంద్రం

| Edited By: Anil kumar poka

Oct 18, 2020 | 6:53 PM

దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) ఉందని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ అంగీకరించారు. ఇది దేశ వ్యాప్తంగా లేదని, కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా కొన్ని జిల్లాలకే పరిమితంగా ఉందని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు.

దేశంలోని కొన్ని జిల్లాల్లో  కోవిడ్ 19 సామాజిక వ్యాప్తి, అంగీకరించిన కేంద్రం
Follow us on

దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) ఉందని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ అంగీకరించారు. ఇది దేశ వ్యాప్తంగా లేదని, కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా కొన్ని జిల్లాలకే పరిమితంగా ఉందని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. కరోనా సామాజిక వ్యాప్తి లేనే లేదని ఈయన ఇటీవలి వరకు అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సవరించుకున్నారు. ఢిల్లీలో కోవిడ్  కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ మొదలైందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆ మధ్య ఒకటి రెండు సార్లు వెల్లడించారు. కానీ దీన్ని కేంద్రం ధ్రువీకరించలేదు. అలాగే ఇటీవలే తమ రాష్ట్రంలో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి అక్కడక్కడా ప్రారంభమైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆ నేపథ్యంలో హర్ష వర్ధన్  ఈ విషయాన్ని అంగీకరించక తప్పలేదు. ఇండియాలో కరోనా వైరస్ కేసులు దాదాపు 75 లక్షలకు చేరుకున్నాయి.