పెగాసస్ వివాదంపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల శివసేన హర్షం ప్రకటించింది. ఇది ముఖ్యమైన, సాహసోపేత నిర్ణయమని తన సామ్నా పత్రికలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విధమైన కమిషన్లను ఏర్పాటు చేయాలనీ, తమ ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపింది. ఈ వివాదాస్పద అంశంపై విచారణకు జ్యూడిషియల్ కమిషన్ ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అప్పుడే ఎంక్వయిరీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.. ఇది ముదావహం అని శివసేన వ్యాఖ్యానించింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండును కేంద్ర పట్టించుకోవడంలేదని, భారత ప్రజల స్వేచ్ఛపై దాడి జరుగుతున్నా చోద్యం చూస్తోందని ఈ పార్టీ ఆరోపించింది అంతే కాదు… ఈ గూఢచర్యం కేసును ఆపడానికి పార్లమెంటు కూడా రెడీగా లేదని, కనీసం ఎంక్వయిరీ కమిషన్ నియమాకానికి కూడా సిద్ధంగా లేరని శివసేన దుయ్యబట్టింది.
కొందరు మొద్దు నిద్ర పోతున్నప్పుడు వారిని ఎవరో ఒకరు మేల్కొలపాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అందుకే తాము ఈ కమిషన్ ని ఏర్పాటు చేశామన్నారు. జస్టిస్ భట్టాచార్య, జస్టిస్ లోకూర్ తమ విచారణను త్వరలో ప్రారంభిస్తారని ఆశిస్తున్నామని ఆమె చెప్పారు. ఈ ఇన్వెస్టిగేషన్ తో నైనా కేంద్రం మేల్కొంటుందని భావిస్తున్నామని, ఇది అత్యాశ కాదని ఆమె పేర్కొన్నారు. పెగాసస్ పై రోజూ పార్లమెంటులో విపక్షాలు ప్రభుత్వాన్ని స్తంభింప జేస్తున్నా ప్రయోజనం లేకపోతోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాలు కూడా ఇలా స్వతంత్రంగా కమిషన్లను నియమించగలవన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.