Coimbatore Blast: ఆలయాల దగ్గర ఆత్మాహుతి దాడికి కుట్ర.. కోయంబత్తూరు బ్లాస్ట్ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు

తమిళనాడు కోయంబత్తూరులో కారు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఎన్ఐఏ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.

Coimbatore Blast: ఆలయాల దగ్గర ఆత్మాహుతి దాడికి కుట్ర.. కోయంబత్తూరు బ్లాస్ట్ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
Coimbatore Bomb Blast

Updated on: Oct 30, 2022 | 1:51 PM

తమిళనాడు కోయంబత్తూరులో కారు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఎన్ఐఏ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. కారులో పేలుడుపై ఇప్పటికే తమిళనాడు సిట్‌ అధికారులు చేపట్టిన దర్యాప్తు వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిట్‌ బృందం కూడా ఎన్ఐఏ అధికారులతో కలిసి పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అయితే.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చయి. కోయంబత్తూరులో మూడు ఆలయాలను పేల్చివేయడానికి జమీషా ముబిన్‌ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 23న ఉక్కడం దగ్గర కారులో పేలుడులో ముబిన్‌ చనిపోయాడు. అరెస్టయిన ముబిన్‌ ఆరుగురు అనుచరులు విచారించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కోనియమ్మన్‌ ఆలయం, కోట్టైమేడు సంఘమేశ్వరాలయం, పులియకుళం వినాయకర్‌ ఆలయం దగ్గరు ఈ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. మూడు ఆలయాల దగ్గర సీటీవీ కెమెరాలలో నమోదైన వీడియో ఆధారాలను పరిశీలించినప్పుడు ముబిన్‌ అతని అనుచరులు ఈ ఆలయాల వద్ద తచ్చాడిన దృశ్యాలు కనిపించాయి. అయితే, కారులో చనిపోయిన మోబిన్ సూసైడ్ బాంబర్ కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇంకా కారు పేలుడులో మృతి చెందిన జమీషా ముబిన్‌ నివాసగృహంలో పొటాషియం నైట్రేట్‌, బ్లాక్‌ పౌడర్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌, అల్యూమినియం పౌడర్‌, రెడ్‌ ఫాస్పరస్‌, రెండు మీటర్ల పొడవు కలిగిన జెలిటిన్‌ స్టిక్‌, సీసాపెంకులు, సల్ఫర్‌ పౌడర్‌, బ్యాటరీలు, వైర్లు, పేకింగ్‌ టేప్‌లు, పుస్తకాలు, డైరీలు, వంటి 109 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు అరెస్టయిన మొబిన్ స్నేహితుల నుంచి పలు విషయాలను కూడా సేకరించారు. వారికి ఉగ్రవాదులతో లింకులున్నట్లు బయటపడింది.

ఇవి కూడా చదవండి

కాగా.. 23 తెల్లవారుజామున 4 గంటలకు కొట్టైమేడులోని సంగమేశ్వర ఆలయం ముందున్న కారు బ్లాస్ట్ అయింది. పేలుడులో చనిపోయిన మోబిన్‌కు టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు దర్యాప్తులో వెల్లడికాడం, గతంలో ఎన్‌ఐఏ కూడా విచారించడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పోలీసుల విచారణలో ఉగ్రకుట్ర బయటపడంతో ఎన్ఐఏ దర్యాప్తును ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..