- Telugu News Photo Gallery Country Largest Maze Garden Built in Gujarat more than 1 Lakh Saplings Planted Here, All you need to know
PM Modi: దేశంలోనే అతిపెద్ద మేజ్ గార్డెన్.. 1.8 లక్షల మొక్కలతో శ్రీయంత్రం.. ఈ ఫోటోలు చూడండి..
భారత ఉక్కు మనిషి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి (అక్టోబర్ 31న) ని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. స్టాచ్యు ఆఫ్ యూనిటీ వద్ద మరో మూడు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటి మేజ్ గార్డెన్. ఇందులో1.8 లక్షల మొక్కలు నాటారు.
Updated on: Oct 30, 2022 | 3:25 PM

గుజరాత్‌లోని కెవాడియాలో 'టేబుల్ గార్డెన్' అంటే మేజ్ పార్క్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ మేజ్ పార్క్ 3 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద టేబుల్ గార్డెన్.

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి (అక్టోబర్ 31న) ని పురస్కరించుకొని.. ఏక్తా నగర్‌లో మరో కీలక ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎదురుగా జంగిల్ సఫారీకి సమీపంలో ఏర్పాటు చేసిన మియావాకి ఫారెస్ట్ గార్డెన్, భుల్భులయ్య పార్క్ (చిట్టడవి) ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రజలకు అంకితం చేయనున్నారు.

Maze Garden

ఈ చర్య పర్యాటకుల్లో సాహస భావనను కూడా కలిగిస్తుంది. ఈ మేజ్ గార్డెన్ సమీపంలో 1,80,000 మొక్కలు నాటారు. వీటిలో ఆరెంజ్ జెమిన్, మధు కామిని, గ్లోరీ బోవర్, మెహందీ లాంటి మొక్కలు ఉన్నాయి.

ఈ పార్క్ కేవలం 8 నెలల తక్కువ వ్యవధిలో అభివృద్ధి చేయబడింది. ఈ చిట్టడవి 'శ్రీయంత్ర' ఆకారంలో రూపొందించబడింది. ఇది సానుకూల శక్తిని ఇస్తుందని చెబుతారు.




