AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో మైండ్ గేమ్ పాలిటిక్స్.. స్టాలిన్ స్ట్రాటజీకి సీఎం విజయ్ ‘మాస్టర్ స్ట్రోక్!

తమిళనాడు రాజకీయాలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ.. తొలి ప్రయత్నంలోనే 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే, స్పష్టమైన మెజారిటీకి పది స్థానాల దూరంలో ఆగిపోవడంతో, డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీల వెలుపలి మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే విజయ్ సర్కార్‌ను పడగొట్టేందుకు డీఎంకే శతవిధాలా ప్రయత్నిస్తోంది.

తమిళనాడులో మైండ్ గేమ్ పాలిటిక్స్.. స్టాలిన్ స్ట్రాటజీకి సీఎం విజయ్ ‘మాస్టర్ స్ట్రోక్!
Cm Joseph Vijay, Mk Stalin
Ch Murali
| Edited By: |

Updated on: Jun 30, 2026 | 5:19 PM

Share

తమిళనాడు రాజకీయాలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ.. తొలి ప్రయత్నంలోనే ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే, స్పష్టమైన మెజారిటీకి పది స్థానాల దూరంలో ఆగిపోవడంతో, డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీల వెలుపలి మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే విజయ్ సర్కార్‌ను పడగొట్టేందుకు డీఎంకే శతవిధాలా ప్రయత్నిస్తోంది. విజయ్ ప్రభుత్వానికి కేవలం ఆరు నెలల డెడ్‌లైన్ విధిస్తూ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

స్టాలిన్ ‘డెడ్‌లైన్’.. విజయ్ ‘మైనారిటీ’ భయాలు!

ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన వామపక్షాలు, ముస్లిం లీగ్, వీసీకే వంటి పార్టీల మద్దతుపై ఆధారపడి ఉంది. “విజయ్ ప్రభుత్వం మా దయాదాక్షిణ్యాలపై నడుస్తోంది” అంటూ స్టాలిన్ పదే పదే విమర్శిస్తున్నారు. మరోవైపు, అన్నాడీఎంకే నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు విజయ్ వైపు వచ్చినప్పటికీ, వారు సాంకేతికంగా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ తరుణంలో మద్దతు ఇస్తున్న పార్టీలు వెనక్కి తగ్గితే విజయ్ సర్కార్ మైనారిటీలో పడడం ఖాయం. ఈ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సీఎం విజయ్ సరికొత్త మాస్టర్ స్ట్రోక్ సిద్ధం చేశారు.

అసెంబ్లీలో స్టాలిన్ ఎంట్రీకి బ్రేక్?

తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మాజీ సీఎం స్టాలిన్.. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. సీఎం విజయ్ రెండు చోట్ల పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ పోటీ చేసి గెలవగా, ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. డీఎంకేకు గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని స్టాలిన్ వ్యూహం రచిస్తున్నారు. ఒకవేళ స్టాలిన్ అసెంబ్లీలోకి అడుగుపెడితే, ఆయన రాజకీయ చతురతను, అనుభవాన్ని తట్టుకోవడం విజయ్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే స్టాలిన్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమే విజయ్ ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు.

రంగంలోకి వైగో.. విజయ్ ‘మహా కూటమి’ స్కెచ్!

ద్రవిడ వాద రాజకీయాలను అదే ద్రవిడ వాదంతో ఢీకొట్టేందుకు విజయ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే డీఎంకే మాజీ సీనియర్ నేత, ఎండీఎంకే (MDMK) అధినేత వైగోను రంగంలోకి దించుతున్నారు. స్టాలిన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు తిరుచ్చి ఈస్ట్ నుంచి వైగోను బరిలోకి దింపాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వైగో గెలిస్తే ఆయనకు కేబినెట్‌లో కీలక పదవి ఇచ్చి, డీఎంకేకు గట్టి కౌంటర్ ఇవ్వాలనేది విజయ్ ప్లాన్ చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమకు మద్దతిచ్చిన పార్టీలతో ఒక పటిష్టమైన ‘మహా కూటమి’ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ముందడుగు వేశారు. రేపు ఇందుకోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, మద్దతు ఇస్తున్న పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపారు.

మాజీ సీఎం స్టాలిన్ విసిరిన ఆరు నెలల డెడ్‌లైన్ సవాలును తిప్పికొట్టేందుకు విజయ్ వేస్తున్న ఈ పొలిటికల్ స్కెచ్ తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. వైగోను అస్త్రంగా వాడుకుని స్టాలిన్ ఎంట్రీకి విజయ్ బ్రేక్ వేయగలిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్ తిరుగులేని శక్తుడిగా ఎదుగుతారని, లేదంటే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us