Himachal Floods: ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు.. పోటెత్తిన వరదలు.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు

| Edited By: Team Veegam

Aug 25, 2022 | 4:07 PM

Himachal Floods: పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో మరణాలు సంభవిస్తున్నాయి..

Himachal Floods: ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు.. పోటెత్తిన వరదలు.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు
Himachal Floods
Follow us on

Himachal Floods: పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో మరణాలు సంభవిస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్ని జలమయం అవుతున్నాయి. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కులు జిల్లాలో బుధవారం భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా సంభవించిన వేర్వేరు సంఘటనలలో ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని మలానా పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 25 మందికి పైగా ఉద్యోగులను ఈ వరదల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, మణికరణ్ జిల్లాలో భారీ వ‌ర్షం కార‌ణంగా సంభవించిన ఆకస్మిక వరదలలో నలుగురు కొట్టుకుపోయారని తెలుస్తోంది. అలాగే పార్వతి నదిపై వంతెన దెబ్బతిన్నది. భారీ వర్షాల మధ్య కులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు నీట మునిగిపోయార‌ని స్థానికులు పేర్కొన్నారు.

కులు జిల్లాలోని చల్లాల్ పంచాయతీలోని చోజ్ గ్రామంలో ఉదయం 6 గంటల సమయంలో మేఘాల విస్ఫోటనం సంభవించిన తరువాత నలుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ సుదేష్ మోఖ్తా తెలిపారు. చోజ్ పార్వతి నదిపై ఉన్న వంతెన కూడా దెబ్బతిన్నదని కులు పోలీసు సూపరింటెండెంట్ గుర్దేవ్ శర్మ తెలిపారు. నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారని, గాలింపు చర్యల్లో పురోగతిలో ఉందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలోభారీగా వ‌ర‌ద నీరు భారీగా వస్తుండటంతో లార్జీ, పండోహ్ డ్యామ్‌ల గేట్లు తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు అధికారులు.

 


గల్లంతైన వారికోసం ప్రత్యేక టీమ్‌ రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి