Ice Cream: ‘ఐస్’ క్రైమ్‌ కథా చిత్రమ్.. బాలుడికి ఐస్‌క్రీం కొనిచ్చిన మేనత్త.. తిన్న తర్వాత ఏం జరిగిందంటే..

|

Apr 21, 2023 | 12:50 PM

కేరళలో బయటపడ్డ ‘ఐస్’ క్రైమ్‌ స్టోరీ కలకలం రేపింది. ఓ మహిళ భారీ స్కెచ్ వేసి బాలుడికి ఐస్ క్రీమ్ తినిపించింది. అది తిన్న బాలుడు విలవిలలాడాడు.. చివరకు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అసలేం జరిగింది.. ఆమె ఎందుకు బాలుడికి ఐస్ క్రీమ్ తినిపించింది..? అనే విషయాలు మిస్టరీగా మారాయి.

Ice Cream: ‘ఐస్’ క్రైమ్‌ కథా చిత్రమ్.. బాలుడికి ఐస్‌క్రీం కొనిచ్చిన మేనత్త.. తిన్న తర్వాత ఏం జరిగిందంటే..
Ice Cream
Follow us on

కేరళలో బయటపడ్డ ‘ఐస్’ క్రైమ్‌ స్టోరీ కలకలం రేపింది. ఓ మహిళ భారీ స్కెచ్ వేసి బాలుడికి ఐస్ క్రీమ్ తినిపించింది. అది తిన్న బాలుడు విలవిలలాడాడు.. చివరకు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అసలేం జరిగింది.. ఆమె ఎందుకు బాలుడికి ఐస్ క్రీమ్ తినిపించింది..? అనే విషయాలు మిస్టరీగా మారాయి. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. అరికులం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అలీ కుమారుడు అహ్మద్‌ హసన్‌ రిఫాయి (12) మృతి చెందాడు. చంగరోత్ ఎంయూపీఎస్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం ఐస్ క్రీం తిని వాంతులు చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు అహ్మద్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. అయితే అహ్మద్ మరణంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు..రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో అసలు నిజాలు బయటపెట్టారు.

సొంత అత్తే బాలుడిని చంపాలని స్కెచ్ వేసినట్లు తేలింది. సుపర్ మార్కెట్ నుంచి తెచ్చిన ఐస్ క్రీమ్‌ లో విషం కలిపింది తహిరా.. అనంతరం బాలుడికి తినిపించింది. ఆ తర్వాత బాలుడు వాంతులతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. బాలుడు తిన్న ఐస్‌ క్రీమ్‌లో అమ్మోనియం ఫాస్ఫరస్ విషం కలిపినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే తహిరను అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలుడిని చంపింది ఆస్తి కోసమా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో విచారణ చేపట్టారు.

ఈ ఘటన కేరళలో కలకలం రేపింది. బాలుడిని చంపిన మేనత్తపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..