AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే.. చోలే బతూరే ఫ్రీ.. కండీషన్స్ అప్లై

దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం రెండో డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు డోసులు తీసుకున్నవారందరూ ఈ బూస్టర్ డోసు తీసుకోవాలని వెల్లడించింది...

Corona: బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే.. చోలే బతూరే ఫ్రీ.. కండీషన్స్ అప్లై
Chole Bathure
Ganesh Mudavath
|

Updated on: Aug 01, 2022 | 12:34 PM

Share

దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం రెండో డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు డోసులు తీసుకున్నవారందరూ ఈ బూస్టర్ డోసు తీసుకోవాలని వెల్లడించింది. అయితే చాలా మంది బూస్టర్ డోస్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అపోహాలు, భయాల మధ్య వ్యాక్సిన్ వేయించుకునేందుకు అంగీకరించడం లేదు. వీటిని గమనించిన ప్రభుత్వం కరోనా టీకాల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, వైరస్ నుంచి సురక్షితంగా ఉండవచ్చని పలు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ క్రమంలో చండీగఢ్ కు చెందిన ఓ చిరు వ్యాపారి వింత ఆఫర్ ప్రకటించారు. బూస్టర్ డోస్ తీసుకున్న వారికి ఒక ప్లేట్ చోలే బతూరే ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ కార్డును చూపిస్తే ఉచితంగానే చోలే బతురే తినవచ్చని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని మోడీ మన్ కీ బాత్ రేడియో ప్రసారంలో ఆ వ్యాపారిని అభినందించారు.

రాణా అనే వ్యక్తి.. చండీగఢ్ లో ఫుడ్ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆ కష్టాలను దగ్గరుండి చూశానని రాణా చెప్పారు. ఆ కష్టాలు ఇంకెవరికీ రాకూడదనే ఉద్దేశ్యంతో బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ.. పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బూస్టర్ డోస్ తీసుకున్న వారికి చోలే బతూరే ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. అర్హులందరూ వెనకాడకుండా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలిని రాణా కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..
అత్యాశ, స్వార్ధం చివరికి ఒంటరిని చేస్తుంది.. అడవిలో భారీ వర్షం కథ
అత్యాశ, స్వార్ధం చివరికి ఒంటరిని చేస్తుంది.. అడవిలో భారీ వర్షం కథ
సొరకాయ అంటే ఇష్టంలేదా? ఇలా దోశలు వేసి చూడండి.. పిల్లలు కూడా..
సొరకాయ అంటే ఇష్టంలేదా? ఇలా దోశలు వేసి చూడండి.. పిల్లలు కూడా..
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆగస్టు 8 రాశిఫలాలు: వారికి అదృష్టం, ఉద్యోగ పదోన్నతి..
ఆగస్టు 8 రాశిఫలాలు: వారికి అదృష్టం, ఉద్యోగ పదోన్నతి..