AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India – China Ties: సరిహద్దుల్లో చైనా కంత్రీ వేషాలు.. అరుణాచల్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించిన డ్రాగన్‌

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. అరుణాచల్‌తో పాటు తాజాగా భూటాన్‌లో కూడా అక్రమంగా గ్రామాలను నిర్మిస్తోంది డ్రాగన్‌. 

India - China Ties: సరిహద్దుల్లో చైనా కంత్రీ వేషాలు.. అరుణాచల్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించిన డ్రాగన్‌
Second China Constructed En
Sanjay Kasula
|

Updated on: Nov 18, 2021 | 9:48 PM

Share

చైనా కంత్రీ వేషాలు కొనసాగుతున్నాయి. గతంలో అరుణాచల్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించిన డ్రాగన్‌ తాజాగా భూటాన్‌ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. భారత సరిహద్దు లోని డోక్లాం సమీపంలో 20 వేల ఎకరాలను డ్రాగన్ కంట్రీ కబ్జా పెట్టింది. గత ఏడాది నుంచి భూటాన్‌ సరిహద్దు ప్రాంతంలో ఈ నిర్మానాలను చేపట్టింది. ఇందులో భాగంగా నాలుగు గ్రామాలను కట్టిపడేసింది చైనా . భూటాన్‌లో చైనా ఆక్రమణ దాదాపు ఏడాది నుంచి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో మరో నాలుగు గ్రామాలను ఏర్పాటు చేసినట్లుగా శాటిలైట్‌ చిత్రాలను విశ్లేషించే ‘డెట్రెస్‌ఫా’ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ బయట పెట్టింది.

చైనా చేపట్టిన తాజా నిర్మాణాలు భారత భూభాగం లోని డోక్లాంకు అత్యంత సమీపంలో ఉండటంపై విదేశాంగశాఖ సీరియస్‌గా తీసుకుంది. డోక్లాంలో భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత కూడా ఈ అక్రమ నిర్మాణాలను కొనసాగించింది. 2020 మే నుంచి 2021 నవంబర్‌ మధ్యలో ఈ నిర్మాణాలు జరిగినట్లుగా అంచనా వేసింది డెట్రెస్‌ఫా.

భారత్‌-భూటాన్‌ల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. భూటాన్‌ ఆర్మీకి భారత్‌ శిక్షణ కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా భూటన్‌ సరిహద్దులపై చైన దొంగ కన్నువేసింది. కొద్దినెలల క్రితమై భూటాన్‌తో సరిహద్దు వివాదంపై చైనా పెద్ద ఎత్తున చర్చలు జరిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా చైనా నిర్మించిన రెండో గ్రామం శాటిలైట్‌ చిత్రాలు కూడా బయట పడ్డాయి. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 బిల్డింగ్‌ సముదాయాలను నిర్మించిన‌ట్లుగా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌‌లోని షియోమి జిల్లాలో ఈ ప్రాంతం ఉన్నట్టు డెట్రెస్‌ఫా తెలిపింది.

ఎల్‌ఏసీ , అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం మధ్య ఉన్న భార‌త భూభాగంలో చైనా సెకండ్ ఎన్‌క్లేవ్‌ను నిర్మించిన‌ట్టు అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి.  ఇదిలావుంటే దొంగ చైనాకు గట్టి హెచ్చరిక చేశారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. భారత భూభాగం వైపు కన్నెత్తి చూస్తే అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా తూర్పు లద్దాఖ్‌లో ఆయన పర్యటించిన ఆయన చైనాకు స్ట్రాంగ్ వర్నింగ్ ఇవ్వడం పెద్ద సాహసంగా నిర్ణయించారు. 1962 భారత్‌ -చైనా యుద్దం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. రెజాంగ్‌లో యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. ఆనాటి యుద్దంలో పాల్గొన్న వీరజవాన్‌ను వీల్‌చెయిర్‌లో స్వయంగా తీసుకొచ్చారు రాజ్‌నాథ్‌.

ఇవి కూడా చదవండి: CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..

ఒక్క స్ట్రోక్‌తో కోటీశ్వరులైన మదుపరులు.. గతేడాది రూ. 12 పెట్టుబడి పెడితే ఇప్పుడెంతో తెలుసా?