AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్ ను వీడని వర్షాలు.. వడోదరను ‘ ముంచెత్తుతున్న మొసళ్ళు ‘

భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ సతమతమవుతోంది. ముఖ్యంగా వడోదర, కచ్ వంటి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో వీధులు నిండిపోతున్నాయి. వడోదరలో గత 24 గంటల్లో 500 మి. మీ. వర్షంపడింది. నదులనుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. అవి కుక్కల సమీపంలో రావడం, జనావాసాల ప్రాంతాల్లో కనిపించడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వీటి తాలూకు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. శనివారం సాయంత్రం వడోదరలో నీటితో […]

గుజరాత్ ను వీడని వర్షాలు.. వడోదరను  ' ముంచెత్తుతున్న మొసళ్ళు '
Pardhasaradhi Peri
|

Updated on: Aug 04, 2019 | 12:38 PM

Share

భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ సతమతమవుతోంది. ముఖ్యంగా వడోదర, కచ్ వంటి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో వీధులు నిండిపోతున్నాయి. వడోదరలో గత 24 గంటల్లో 500 మి. మీ. వర్షంపడింది. నదులనుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. అవి కుక్కల సమీపంలో రావడం, జనావాసాల ప్రాంతాల్లో కనిపించడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వీటి తాలూకు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. శనివారం సాయంత్రం వడోదరలో నీటితో నిండిన వీధిలో సుమారు అయిదు అడుగుల పొడవున్న మొసలి కనిపించడంతో స్థానికులు వెంటనే అధికారులకు సమాచారమందించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ అక్కడికి చేరుకొని దాన్ని రక్షించారు. ఆ మొసలి నోటిఫై ముందుగా ఓ టవల్ విసిరి.. అనంతరం దాని నోటిని తాడుతో కట్టేసి.. . దాన్ని మొసళ్ల సంరక్షక కేంద్రానికి తరలించారు. ఈ వీధికి సమీపంలోనే మరో మూడు మొసళ్లను రక్షించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా- ఖారి, విశ్వామిత్ర నదులు పొంగి పొర్లుతున్న కారణంగా కచ్ జిల్లాలోనూ వీటి ‘ తాకిడి ‘ ఎక్కువైంది. భుజ్ విమానాశ్రయానికి దారి తీసే రోడ్డులో ఒక మొసలిపైనుంచి గుర్తు తెలియని వాహనమొకటి వెళ్లడంతో అది మరణించింది. జిల్లాలో ఈ నాలుగైదు రోజుల్లోనే తాము మొత్తం 15 మొసళ్లను, నాలుగు పాములను రక్షించినట్టు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. వీధుల్లో ఇవి ఎక్కువగా కనిపించడం ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. అసలే భారీ వర్షాలు, వరదలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రమాదకరమైన ప్రాణులు సంచరించడం వారిని భీతావహులను చేస్తోంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్