నిద్రిస్తున్న చిన్నారిని కాలితో తన్నిన పోలీస్ కానిస్టేబుల్.. వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే శాఖ.. ఏమన్నదంటే..?

Uttara Pradesh: రైల్వే స్టేషన్ ఆవరణలో నిద్రిస్తున్న చిన్నారిని కాలితో తన్నిన రైల్వే పోలీస్ అధికారి సస్పెండయ్యాడు. ఉత్తర ప్రదేశ్ బల్లియాజిల్లాలోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో..

నిద్రిస్తున్న చిన్నారిని కాలితో తన్నిన పోలీస్ కానిస్టేబుల్.. వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే శాఖ.. ఏమన్నదంటే..?
Up Railway Station Incident Visuals

Updated on: Jul 17, 2023 | 12:28 PM

Uttara Pradesh: రైల్వే స్టేషన్ ఆవరణలో నిద్రిస్తున్న చిన్నారిని కాలితో తన్నిన రైల్వే పోలీస్ అధికారి సస్పెండయ్యాడు. ఉత్తర ప్రదేశ్ బల్లియాజిల్లాలోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన నార్త్ ఈస్టర్న్ రైల్వే విభాగం ‘ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నాం. సంబంధిత కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేశాం’ అని వైరల్ అవుతున్న వీడియోకు రిప్లై ఇచ్చింది.

చిన్నారిని కాలితో తన్నిన కానిస్టేబుల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే వారణాసి ఆర్‌పీఎఫ్ విభాగానికి చెందిన బలిందర్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు అతన్ని సస్పెండ్ చేసి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారణాసి డివిజన్ పీఆర్ఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఘటనపై దర్యాప్తు జరుగుతుంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని జాతీయ వార్తల కోసం..