IND vs WI: రెండో మ్యాచ్‌‌లో టీమిండియా గెలిచినా, నెం.1 టెస్ట్‌ స్థానానికి గండం.. అదెలా అంటే..?

IND vs AUS for Test No. 1 Spot: భారత్-వెస్టీండిస్ మధ్య జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో కరేబియన్లపై ఘన విజయం సాధించింది. యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర సెంచరీ, రవిచంద్రన్ ఆశ్విన్ 12 వికెట్ల బౌలింగ్ ప్రదర్శన రోహిత్ నేతృత్వంలోని..

IND vs WI: రెండో మ్యాచ్‌‌లో టీమిండియా గెలిచినా, నెం.1 టెస్ట్‌ స్థానానికి గండం.. అదెలా అంటే..?
IND vs AUS for Test No. 1 Spot
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 17, 2023 | 8:20 AM

IND vs AUS for Test No. 1 Spot: భారత్-వెస్టీండిస్ మధ్య జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో కరేబియన్లపై ఘన విజయం సాధించింది. యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర సెంచరీ, రవిచంద్రన్ ఆశ్విన్ 12 వికెట్ల బౌలింగ్ ప్రదర్శన రోహిత్ నేతృత్వంలోని టీమిండియాకు ఈ విజయాన్ని అందించాడు. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉండగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే భారత్-వెస్టీండిస్ రెండో టెస్ట్‌లో టీమిండియా గెలిచినా.. తన అగ్రస్థానం సురక్షితంగా లేదు. ఎందుకంటే..

ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్రస్తుతం 121 రేటింగ్‌తో నెం.1 జట్టుగా ఉంది. ఆస్ట్రేలియా 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని కంగారులు కనుక ఇంగ్లీష్ టీమ్‌పై మరో విజయం సాధిస్తే టీమిండియా అగ్రస్థానం నుంచి వైదొలుగుతుంది. 5 టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆసీస్ 2-1 తేడాతో ఇంగ్లాండ్‌పై ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో భారత్‌ 2-0తో వెస్టిండీస్‌పై విజయం సాధించినా.. ఆస్ట్రేలియా 4-1 తేడాతో యాషెస్‌ సిరీస్‌ని గెలుచుకుంటే, ఆసీస్ ఆగ్రస్థానానికి చేరుతుంది. ఒకవేళ భారత్-వెస్టీండిస్ రెండో టెస్ట్ డ్రా అయి.. యాషెస్ సిరీస్‌ని 3-1 తేడాతో ఆసీస్ గెలిచినా కంగారులు అగ్రస్థానానికి చేరుకుంటారు.

అయితే భారత్-వెస్టిండీస్ సిరీస్ 1-1 గా సమం అయితే.. పరిస్థితులు వేరుగా ఉంటాయి. యాషెస్ సిరీస్‌లో మిగిలిన ఉన్న 2 టెస్టులు డ్రా లేదా 3-2 తేడాతో ఆస్ట్రేలియా గెలిచినా ఆసీస్ టీమ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుతుంది. కాగా, భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు జూలై 20న ప్రారంభకానుంది. అలాగే యాషెస్ నాల్గో టెస్ట్ జూలై 19న, ఐదో మ్యాచ్ జూలై 27న ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..