AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: భీకర ఘటన.. యువతిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. కారణం ఏంటో తెలుసా?

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని ఓ కిరాతకుడు అత్యంత క్రూరంగా చంపేశాడు. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు కసితీరా పొడిచి పొడిచి హతమార్చాడు.

Chhattisgarh: భీకర ఘటన.. యువతిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. కారణం ఏంటో తెలుసా?
Screwdriver
Shiva Prajapati
|

Updated on: Dec 27, 2022 | 4:42 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని ఓ కిరాతకుడు అత్యంత క్రూరంగా చంపేశాడు. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు కసితీరా పొడిచి పొడిచి హతమార్చాడు. ఈ భయానక ఘటన మంగళవారం చోటు చేసుకుంది. అయితే, యువతి తనతో మాట్లాడటకపోవడం వల్లే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడట. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోర్బా జిల్లాలో తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు.

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) పంప్ హౌస్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది యువతి. అయితే, యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ఈ కీచకుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. అతను దిండు తీసుకుని ఆమె తలపై అదిమిపెట్టాడు. ఆ తరువాత స్క్రూ డ్రైవర్‌తో 51సార్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, బాధితురాలి సోదరుడు ఇంటికి వచ్చి చూడగా.. యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది.

అయితే, జష్‌పూర్ జిల్లాకు చెందిన నిందితుడు మూడేళ్ల క్రితం ఓ ప్యాసింజర్ బస్సులో కండక్టర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో బాధిత యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య మాట మాట కలిసింది. నిందిత వ్యక్తి కొద్ది రోజుల తరువాత ఉపాధి కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లాడు. అయినప్పటికీ ఇద్దరూ ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. అయితే, విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆమె.. నిందిత వ్యక్తితో మాట్లాడటం మానేసింది. ఆగ్రహానికి గురైన అతను.. మొదట యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తరువాత నేరుగా ఇంటికే వచ్చి యువతి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!