Chathisgarh Enconter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అసలు నిజం ఇదే.. క్లారిటీ ఇచ్చిన దంతెవాడ పోలీసులు

38మంది చనిపోయారని పోలీసులు ప్రకటిస్తే.. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ మరోలా ప్రకటించింది. మావోయిస్టుల ప్రకటనకు తేడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో దంతెవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌ క్లారిటీ ఇచ్చారు.

Chathisgarh Enconter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అసలు నిజం ఇదే.. క్లారిటీ ఇచ్చిన దంతెవాడ పోలీసులు
Encounter
Follow us

|

Updated on: Oct 19, 2024 | 7:14 AM

ఛత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌పై దంతెవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. రెండు వారాల క్రితం జరిగిన ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాలకు.. మావోయిస్టుల ప్రకటనకు తేడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో దంతెవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌ క్లారిటీ ఇచ్చారు.

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ- నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్‌మాఢ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనాస్థలంలో భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నారాయణపూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దులోని తుల్తులి, నెందుర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతుందనే సమాచారంతో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, డీఆర్‌జీ దళాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు ఎటాక్‌ చేశాయి. దాంతో.. మావోయిస్టులు- పోలీసులకు మధ్య దాదాపు 10 గంటలపాటు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 38మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

అయితే.. 38మంది చనిపోయారని పోలీసులు ప్రకటిస్తే.. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ మరోలా ప్రకటించింది. ఎన్‌కౌంటర్‌లో 31 మంది మృతి చెందినట్లు ప్రకటన విడుదల చేసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజున భద్రతా బలగాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయని.. రోజంతా విడతల వారీగా సుమారు 11 సార్లు కాల్పులు జరిగాయని వెల్లడించింది. స్పాట్‌లో 14మంది చనిపోగా.. గాయపడిన 17మంది మావోయిస్టులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని మరుసటి రోజు కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ వెల్లడించింది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మృతులు సంఖ్యపై పోలీసులు, మావోయిస్టులు ప్రకటనలు భిన్నంగా ఉండడంతో ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు దంతెవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టులపై మొత్తం 2 కోట్ల 62 లక్షల రూపాయల రివార్డ్ ఉందన్నారు దంతెవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..