AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రాతి చేపకు జీవం వస్తే కలియుగం అంతమే.. ఎక్కడో తెలుసా?

అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని సౌమ్యనాథస్వామి దేవాలయంలో యుగాంతం గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలుపుతూ వచ్చారు. మరి కొన్ని పురాణాలూ యుగాంతం గురించి చెబుతూనే వచ్చాయి. ఐతే యుగంతాం గురించి సౌమ్యనాథ స్వామి ఆలయంలోని చేప కూడా చెబుతుంది.

AP News: రాతి చేపకు జీవం వస్తే కలియుగం అంతమే.. ఎక్కడో తెలుసా?
Soumyanathaswamy Temple
Sudhir Chappidi
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 18, 2024 | 10:17 PM

Share

అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో సౌమ్యనాథస్వామి దేవాలయం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన దేవాలయం 10 ఎకరాల విస్తీర్ణం కలిగి 108 స్తంభాలతో నిర్మించబడింది. ఈ దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. సౌమ్యనాథ స్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఈ ఆలయం స్థానిక ఇతిహాసాలు మరియు ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఆలయ వాస్తుకళకు ఆదరణ పొందిన చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. శతాబ్దాలుగా ఈ ఆలయం విష్ణు భక్తులకు అతి ముఖ్యమైన ప్రదేశం. స్వౌమ్యనాధస్వామి ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో కొన్ని శాసనాలపై సూర్య చంద్ర చిహ్నాలు ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై మత్య్స, సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి. ఆలయంలోని శిల్ప కలలకు ఎంతో పురాతన చరిత్ర దాగి ఉంది. అంతే కాదు కలియుగం అంతానికి చేపకు సంబంధం కూడా ఉందంటారు.

యుగాంతం గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలుపుతూ వచ్చారు. మరి కొన్ని పురాణాలూ యుగాంతం గురించి చెబుతూనే వచ్చాయి. ఐతే యుగంతాం గురించి సౌమ్యనాథ స్వామి ఆలయంలోని చేప కూడా చెబుతుంది. స్వామివారి ఆలయంలో అంతర్ భాగంలో పైన ఒక రాతిపై చేప ఆకారాన్ని శిల్పంగా చెక్కారు. అక్కడ మత్స్య ఆకారాన్ని చెక్కడానికి పెద్ద చరిత్ర ఉంది. అక్కడి వేద పండితులు చెప్పే విషయాల ప్రకారం భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయంలో లోపలికి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఈ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని పురాణాలు చెబుతున్నాయని వేదపండితులు అంటున్నారు. అప్పుడు ఈ కలియుగం అంతం అవుతుందని స్థల పురాణం చెప్తోందని అంటున్నారు. ఇంతకీ చేపకు జీవం వస్తుందా కలియుగం అంతం అవుతుందా అనేది శాస్త్రీయం. ఇది ఏమైనా కలియుగ అంతంపై అనేక పురాణాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి