Bomb Note: ఢిల్లీ – వడోదర ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. టాయిలెట్‌లో కనిపించిన..!

|

May 16, 2024 | 2:50 PM

రన్‌వేపై విమానం సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్‌ అవుతుందనగా ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసిఉన్న నోట్‌ను విమానంలోని లావేటరీలో సిబ్బంది గుర్తించారు. ఈ నోట్‌తో విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో

Bomb Note: ఢిల్లీ – వడోదర ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. టాయిలెట్‌లో కనిపించిన..!
Air India Express
Follow us on

గత కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడో ఒక చోట బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇందులో విమానాలు, ఎయిర్‌ పోర్టులకు సైతం ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. తాజాగా ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావటం కలకల రేపింది. విమానం టాయిలెట్‌లోని టిష్యూ పేపర్‌పై రాసివున్న బెదిరింపు మెసేజ్‌ ప్రయాణికుల్ని, సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణికులందరినీ విమానంలోంచి కిందకు దింపేశారు.

ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్‌ అవుతుందనగా ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసిఉన్న నోట్‌ను విమానంలోని లావేటరీలో సిబ్బంది గుర్తించారు. ఈ నోట్‌తో విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు, పేలుడు పదార్థాలూ కనిపించలేదు.

దీంతో అధికారులు, సిబ్బంది అంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రయాణికుల్ని అంతకు ముందుగానే మరో విమానంలో వడోదరకు పంపించారు. మరోవైపు ఘటనపై విమానాశ్రయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..