AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇస్రో’ ట్వీట్.. ‘చంద్రయాన్ 2’ ఫెయిల్ అయినట్టేనా..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడట్లేదు. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్పటి నుంచి ఈ ల్యాండర్‌తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా తన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక నాసా ప్రయోగించిన లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్ఓ) […]

‘ఇస్రో’ ట్వీట్.. 'చంద్రయాన్ 2' ఫెయిల్ అయినట్టేనా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 18, 2019 | 1:58 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడట్లేదు. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్పటి నుంచి ఈ ల్యాండర్‌తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా తన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక నాసా ప్రయోగించిన లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్ఓ) మంగళవారం చంద్రుడి ఉపరితలానికి చేరుకొని.. విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతం నుంచి ప్రయాణం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ‘‘మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తితో మేము ముందుకు సాగుతాం’’ అని ఇస్రో ట్వీట్ చేసింది. దీంతో ‘చంద్రయాన్ 2’ ప్రయోగం విఫలైమంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇస్రో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి జాడను కనుగొనేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. జూన్ 22న నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 2 ఆ తరవాత ఒక్కో దశను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరితల కక్ష్యలోకి చేరింది. అక్కడ ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి మీద దిగడానికి 2.1కి.మీల దూరంలో ఉండగా సంకేతాలు ఇవ్వడం మానేసింది. దీంతో విక్రమ్ ల్యాండర్ బలంగా చంద్రుడి భూతలాన్ని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక ఆ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. మీ వెంట మేమున్నామంటూ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు తమ సపోర్ట్‌ను ప్రకటించారు. అయితే ఆర్బిటర్ పంపిన ఫొటోలతో ల్యాండర్‌ ముక్కలు అవ్వలేదని నిర్దారణకు వచ్చారు. ఆ తరువాత విక్రమ్ ల్యాండర్‌తో సంకేతాలు పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ల్యాండర్ పరిస్థితి ఏంటి..? చంద్రయాన్ 2 ప్రయోగం ఏమైంది..? అన్న ప్రశ్నలకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాధానం చెప్తారేమో చూడాలి.  అయితే ఆర్బిటర్ మాత్రం మరో ఏడేళ్లు చంద్రుడి చుట్టూ పరిభ్రమించనుంది.

Follow Us
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే