రాజ్యసభలో ఎంపీలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీరియస్.. ఫోన్లు వాడొద్దంటూ ఆగ్రహం..

|

Feb 03, 2021 | 12:50 PM

కొంతమంది ఎంపీలు పార్లమెంటు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు బుధవారం ఆగ్రహం..

రాజ్యసభలో ఎంపీలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీరియస్.. ఫోన్లు వాడొద్దంటూ ఆగ్రహం..
Follow us on

Rajya Sabha Chairman M. Venkaiah Naidu: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఎంపీలు పార్లమెంటు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ వాడరాదంటూ వెంకయ్య నాయుడు సభ్యులకు సూచించారు. సభ జరుగుతున్న సమయంలో కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా.. సభా కార్యకలాపాలను కూడా వీడియోలు తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నతమైన రాజ్యసభ ఛాంబర్లో కూర్చొని కూడా సభ్యులు ఇలా వీడియోలు చిత్రీకరించడం పార్లమెంటు నిబంధనలకు విరుద్ధమని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఇప్పటినుంచి ఎవరూ కూడా ఛాంబర్లలో కానీ, సభా ప్రాంగణంలో కానీ మొబైల్ ఫోన్లు వాడడానికి వీల్లేదంటూ వెంకయ్యనాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Also Read:

Rajya Sabha: వ్యవసాయ చట్టాలు, రైతు సమస్యలపై రాజ్యసభలో 15గంటల చర్చ.. ప్రభుత్వం, విపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం

Rajya Sabha: ఆ చట్టాలపై చర్చించాల్సిందే.. రాజ్యసభలో సభ్యుల డిమాండ్.. ముగ్గురు ఆప్‌ ఎంపీల సస్పెన్షన్‌