Farm Laws: నేను అలా అనలేదు.. సాగుచట్టాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి తోమర్‌

|

Dec 26, 2021 | 9:19 AM

సాగు చట్టాలపై జరుగుతున్న రచ్చకు పులిస్టాప్ పెట్టారు కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌. తాను అలా చెప్పలేదని.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేంద్రం రైతుల కోసమే సాగు..

Farm Laws: నేను అలా అనలేదు.. సాగుచట్టాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి తోమర్‌
Thomar
Follow us on

Minister Narendra Singh Tomar: సాగు చట్టాలపై జరుగుతున్న రచ్చకు పులిస్టాప్ పెట్టారు కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌. తాను అలా చెప్పలేదని.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేంద్రం రైతుల కోసమే సాగు చట్టాలను తీసుకొచ్చింది.. కానీ పలు కారణాలతో 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. అయితే.. నిన్న స్వల్ప మార్పులతో సాగుచట్టాలను మళ్లీ తీసుకొస్తామన్నారు తోమర్‌. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతుల కోసం ఎవరూ చేయని పనిని ప్రధాని మోడీ చేశారని చెప్పారు.

మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో ఉద్యమ వేడి చల్లారిందనుకుంటున్న సమయంలో మరోసారి ఆజ్యం పోశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత మోదీ నాయకత్వంలో అతిపెద్ద సంస్కరణ జరిగింది. కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాం. కానీ కొందరు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు తోమర్. అయినా నిరాశ చెందడం లేదు..దేశానికి వెన్నముక లాంటి రైతుల కోసం మళ్లీ ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు.

దీనిపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. రైతులకు ప్రధాని మోడీ క్షమాపణలు, వ్యవసాయ చట్టాల రద్దు కేవలం ఎన్నికల స్టంట్‌ అనుకోవాలా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. సవరణలతో వ్యవసాయ చట్టాలు మళ్లీ తీసుకొస్తామంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌లో స్పందించిన మంత్రి.. ప్రధాని రద్దు చేస్తే.. వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ మళ్లీ ప్రతిపాదించడం అద్భుతమంటూ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..

Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..