గంగా నదిలో మృతదేహాలను పడేయకుండా చూడండి.. యూపీ, బీహార్‌ ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం..

| Edited By: Ram Naramaneni

May 17, 2021 | 8:15 AM

Dumping of bodies in Ganga River: గంగా నదిలో వందలాది మృతదేహాలు లభ్యమవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం

గంగా నదిలో మృతదేహాలను పడేయకుండా చూడండి.. యూపీ, బీహార్‌ ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం..
Dumping Of Bodies In Ganga River
Follow us on

Dumping of bodies in Ganga River: గంగా నదిలో వందలాది మృతదేహాలు లభ్యమవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గంగా నదిలో కోవిడ్-19 బాధితుల మృతదేహాలను పడేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. గంగా నదిలో మృతదేహాలు కొట్టుకువస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయ సంఘటనలని అభిప్రాయపడింది. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని కోరింది.

కోవిడ్-19 బాధితుల మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని జల శక్తి మంత్రిత్వ శాఖ సూచించింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ గంగా నది నీటిని పరీక్షించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది. గంగా నదిలో మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాని ఫిర్యాదులు అందడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ మే 13న స్పందించింది. జల శక్తి మంత్రిత్వ శాఖకు దీంతోపాటు ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది.

గంగా నదిలో మృతదేహాలను పడేయడాన్ని అరికట్టేందుకు గస్తీని ముమ్మరం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. కోవిడ్-19 కారణంగా మరణించినవారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఖర్చులను భరిస్తామని బీహార్ ప్రభుత్వం సైతం పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read;

CID Case: రఘురామకృష్ణంరాజు కాళ్లపై ఉన్న గాయాలకు ‘ఎడిమా’నే కారణం..! రిపోర్టులో..

covid survey : జిల్లాలో 2 శాతం కరోనా పాజిటివ్ రేట్ తగ్గుదల.. సర్వే ద్వారా 11, 504 మంది జ్వరపీడితుల్ని గుర్తించామన్న కృష్ణా కలెక్టర్