సాయుధ బలగాల్లో కొందరు హనీ ట్రాప్‌కు గురవుతున్న వేళ ఆయా విభాగాల ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేయొద్దని, ఆన్‌లైన్ స్నేహాల జోలికి వెళ్లొద్దని తమ సిబ్బందిని కేంద్ర పోలీసు బలగాలు హెచ్చరించాయి. సోషల్ మీడియాలో పరిచయాలు హని ట్రాప్‌కు దారితీస్తాయని, తద్వారా దేశ భద్రతకు, ప్రతిష్టకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవేళ ఆదేశాలు ఉల్లంఘిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్
మీడియాలో పోస్టులు పెడుతున్న కేంద్ర పోలీసు బలగాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆన్‌లైన్ స్నేహాల జోలికి వెళ్లొద్దని, సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేయొద్దని.. తమ సిబ్బందిని కేంద్ర పోలీసు బలగాలు హెచ్చరించాయి. వీటి వల్ల హనీట్రాప్‌కు గురయ్యే ముప్పు పెరుగుతుందని తెలిపాయి. దీంతో సున్నితమైన సమాచారం శత్రువులకు చేరుతుందని వెల్లడించాయి. కొంత మంది సిబ్బంది యూనిఫామ్‌లోనే తమ వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నట్లు.. ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు చేపట్టిన పరిశీలనలో వెల్లడైంది..
ఇదే కాకుండా సున్నితమైన ప్రదేశాల్లో దిగిన ఫొటోలను షేర్ చేయడం, ఆన్‌లైన్‌లో స్నేహితుల కోసం రిక్వెస్ట్‌లు పంపడం వంటి చర్యలను ఆ సంస్థలు గుర్తించాయి. దీనిపై కేంద్ర పారామిలిటరీ, పోలీసు బలగాలకు కేంద్ర నిఘా సంస్థలు లేఖ రాశాయి. దీంతో అలెర్టైన పోలీసు బాసులు.. తమ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేయొద్దని స్పష్టం చేశాయి. ఈ రూల్స్ క్రాస్ చేస్తే తీవ్రమైన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించాయి. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీపీబీ సిబ్బందికి ఈ ఆదేశాలు అందాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందికి ఈ ఆదేశాలు అందాయి.
ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోఢా సైతం తమ బలగాలకు ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. “విధుల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా వినియోగించొద్దు. సున్నితమైన సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు. యూనిఫామ్‌లో రీల్స్, వీడియోలు చేయడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. హై-సెక్యూరిటీ ఏరియాలు, సెలబ్రిటీలు, నాయకుల వీడియోలు తీయకూడదు.” అని హెచ్చరించారు. ఆర్మీ, ఎయిర్ పోర్స్, నేవిలో పనిచేస్తున్న వ్యక్తులకు వలపు వల విసిరి.. కంట్రీ సేఫ్టీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..