India’s First AC Train Terminal: ఆ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెడితే విమానాశ్రయంలోకి వెళ్లామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడ చూసినా మిరిమిట్లు గొలిపే లైటింగ్స్, పూర్తిగా ఏసీ ఇలా అచ్చంగా ఎయిర్ పోర్ట్‌లోనే ఉన్నామా.. అన్న ఫీలింగ్ కలగకమానదు. అదే బెంగళూరులో తాజాగా నిర్మించిన రైల్వే టర్మినల్.
భారత దేశానికి చెందిన ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీదుగా నిర్మాణం ప్రారంభించిన ఈ రైల్వే టర్నినల్ నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని కేంద్రం రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. రైల్వే టర్మినల్‌కు సంబంధించిన ఫొటోలను మంత్రి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే సుమారు రూ314 కోట్లతో నిర్మించిన ఈ టర్మినల్ దేశంలో తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టర్మినల్‌గా పేరుగాంచింది. బెంగళూరులోని బయ్యప్పన్ హళ్లిలో 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్ ద్వారా రోజు 50 వేల మంది రాకపోకలు సాగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ టర్మినల్‌లో ఏకంగా 250 కార్లు, 800 బైక్‌లు పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే నిజానికి ఈ టర్మినల్ గత ఫిబ్రవరి నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India’s first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1
— Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021
Also Read: మమతా ముఖర్జీకి తగిలిన గాయం’యాక్సిడెంటల్’, ఈసీకి ప్రత్యేక పరిశీలకుల నివేదిక