Lok Sabha: దేశ వ్యాప్తంగా క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు.. వీటిపై ప్రత్యేక దృష్టి..

న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఈ చట్టాలను రూపొందించారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్‌లో న్యాయ సంహిత, సాక్ష్యా అధినియమ్‌, నాగరిక్‌ సురక్షా సంహితను తీసుకురానున్నారు. బ్రిటిష్​ కాలం చట్టాలకు ముగింపుపలికేలా కీలక మార్పులను కేంద్రం తీసుకొస్తోంది. జీరో ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా సమన్లు పంపడం, నేర సంఘటనలను తప్పనిసరి వీడియోగ్రఫీ చేయాలన్న నిబంధన తీసుకురానున్నారు.

Lok Sabha: దేశ వ్యాప్తంగా క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు.. వీటిపై ప్రత్యేక దృష్టి..
Criminal Laws
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 01, 2024 | 10:01 AM

న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఈ చట్టాలను రూపొందించారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్‌లో న్యాయ సంహిత, సాక్ష్యా అధినియమ్‌, నాగరిక్‌ సురక్షా సంహితను తీసుకురానున్నారు. బ్రిటిష్​ కాలం చట్టాలకు ముగింపుపలికేలా కీలక మార్పులను కేంద్రం తీసుకొస్తోంది. జీరో ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా సమన్లు పంపడం, నేర సంఘటనలను తప్పనిసరి వీడియోగ్రఫీ చేయాలన్న నిబంధన తీసుకురానున్నారు. దాదాపు 163 ఏళ్లుగా ఉన్న చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రాబోతున్నాయి. ఉగ్రవాదానికి సరైన నిర్వచనంతో పాటు రాజద్రోహం పదం తొలగించి.. న్యాయ సంహితలో దేశద్రోహం అనే కొత్త పదం చేర్చారు. ఈ సమాజంలో నేరాలను తొందరగా పరిష్కరించేందుకు మార్పులు ఉపయోగపడతాయని కేంద్రం చెబుతోంది. శిక్షలు విధించడం కంటే కూడా న్యాయం అందించడానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని అంటున్నారు. అందరికీ న్యాయం అనే ఉద్దేశంతో కొత్త చట్టాలను పూర్తి సవరణలతో తీసుకొచ్చారు. బ్రిటిష్‌ కాలం చట్టాలను పక్కనపెట్టి కొత్త చట్టాలను భారతీయులే రూపొందించారు.

ఏదైనా క్రిమినల్ కేసుల్లో విచారణ ముగిసిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. 60 రోజులలోపు చార్జిషీట్‌ దాఖలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. లైంగిక దాడి బాధితుల స్టేట్‌మెంట్‌ను కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మహిళా పోలీసు మాత్రమే రికార్డ్‌ చేయాలని చట్టం చేశారు. అలాగే బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లో ఇవ్వాలని, పిల్లలను అమ్మడాన్ని, కొనడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు చట్టంలో పొందుపరిచారు. మైనర్‌పై గ్యాంగ్‌ రేప్‌ జరిగితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది. 511 సెక్షన్ల స్థానంలో 358 సెక్షన్లు మాత్రమే ఉండేలా రూపొందించారు. అంతేకాకుండా 18 సెక్షన్లు రద్దు చేశారు. అలాగే సాక్ష్యాలను జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డిజీ లాకర్‌లో ఉంచనున్నారు. క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేశారు. సాక్ష్యాలను ఆన్‌లైన్‌లో పంపే అవకాశం ఉండనుంది. పెళ్లి చేసుకుంటానంటూ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను మోసం చేసేవారికి కఠిన నిబంధనలు ఉండనున్నాయి. కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు బాధితులు కేసు పురోగతిపై 90 రోజులలోపు అప్‌డేట్‌ పొందేందుకు వీలు ఉంటుంది. క్రిమినల్‌ కేసుల విచారణలో ఆలస్యం తగ్గించేందుకు కోర్టులు గరిష్ఠంగా 2 వాయిదాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక నేరాల్లో నిందితుల ఆస్తులు, స్థిర, చరాస్తులను సీజ్‌ చేసే అధికారం పోలీసులకు కల్పించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..