కేంద్రం కీలక నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెల్స్‌, 2 వెబ్‌సైట్‌లపై నిషేధం..?

|

Jan 22, 2022 | 2:35 PM

Centerl Key Decision: భారత ప్రభుత్వం 35 యూట్యూబ్ ఛానెల్స్‌, 2 వెబ్‌సైట్‌లను నిషేధించింది. ఈ ఛానెల్స్‌ డిజిటల్ మీడియాలో భారత్‌కి వ్యతిరేకంగా

కేంద్రం కీలక నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెల్స్‌, 2 వెబ్‌సైట్‌లపై నిషేధం..?
Youtube
Follow us on

Centerl Key Decision: భారత ప్రభుత్వం 35 యూట్యూబ్ ఛానెల్స్‌, 2 వెబ్‌సైట్‌లను నిషేధించింది. ఈ ఛానెల్స్‌ డిజిటల్ మీడియాలో భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంది. ఈ కారణంగా 35 యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ 2 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ చేసిన ఈ ఛానెల్స్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య సుమారు 12 మిలియన్లకు పైగా ఉంది.

అంతేకాదు ఇంటర్నెట్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో ప్రమేయం ఉన్న రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్ ఖాతాను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. పాకిస్థాన్‌లో ఉన్న ఈ సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్‌లను భారత నిఘా సంస్థలు నిశితంగా పరిశీలించి వాటిని మంత్రిత్వ శాఖకు ఫ్లాగ్ చేశాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిషేధిత సోషల్ మీడియా ఖాతాల ఉద్దేశ్యం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.

పాకిస్థాన్ నుంచి 35 ఖాతాలు

35 ఖాతాలు పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్నాయని నాలుగు ప్రచార నెట్‌వర్క్‌లో భాగంగా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో14 యూట్యూబ్ ఛానెల్‌లను నిర్వహిస్తున్న అప్నీ దునియా నెట్‌వర్క్, 13 యూట్యూబ్ ఛానెల్‌లను నిర్వహిస్తున్న తల్హా ఫిల్మ్స్ నెట్‌వర్క్ ఉన్నాయి. నాలుగు ఛానెల్‌ల సెట్, మరో రెండు ఛానెల్‌ల సెట్ కూడా ఒకదానితో ఒకటి సింక్‌లో ఉన్నట్లు కనుగొన్నారు.

ఈ ఛానెల్స్‌ ఒకరికొకరు కంటెంట్‌ను షేర్ చేసుకుంటూ భారత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లను పాకిస్థాన్ టీవీ న్యూస్ ఛానెల్‌ల యాంకర్లు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. భారత సైన్యం, జమ్మూ, కశ్మీర్ గురించి ఇతర దేశాలతో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. మాజీ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతికి సంబంధించి కూడా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న ఖాతాలపై నిషేధం విధించారు.

Viral Photos: ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని ఈ అందమైన ప్రదేశాలను చూడవచ్చు.. ఎలాగంటే..?

Amla Powder: ఇమ్యూనిటీని పెంచే ఉసిరి పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేయండి.. ఎలాగంటే..?

ICICI: ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తోంది.. కొత్త వడ్డీ రేట్లు తెలుసుకోండి..?