భారత దేశ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వ్యవసాయంతోపాటు వ్యవసాయ ఆదరితమైనవాటిపై ఫోకస్ పెట్టింది. తద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే వాటిలో పశుసంవర్ధకం కూడా ఒకటి. దీని ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ప్రస్తుతం పశుసంవర్ధకం రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. అందువల్ల ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పశువుల పెంపకంపై ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. దీని కింద గోపాల్ రత్న అవార్డును జాతీయ స్థాయిలో రైతులకు అందిస్తున్నారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం ఈ అవార్డులను అందిస్తోంది. ఇది రైతులను, పశువుల యజమానులను చాలా ప్రోత్సహాన్ని ఇస్తోంది.
స్వదేశీ జాతుల ఆవులు, గేదల పెంపకాన్ని ప్రోత్సహించినందుకు పశువుల యజమానులకు ఈ అవార్డులను అందిస్తోంది. తాజాగా కేంద్ర పశుసంవర్ధక శాఖ ఓ ప్రకటన చేసింది. గోపాల్ రత్న అవార్డుకు అర్హులైన వారు దరఖస్తులు చేసుకోవాలని ట్వీట్ వేదికగా కోరింది.
50 దేశీయ ఆవులు, 18 స్వదేశీ గేదెలను పెంచుతున్న వారు ఈ అవర్డు కోసం దరఖస్తుల చేసుకోవచ్చు. వారితోపాటు పశుసంవర్ధక లేదా రైతు స్వదేశీ జాతుల ఆవులను పెంచుకునందుకు ప్రోత్సహించేవారు కూడా ఈ అవార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కృత్రిమ గర్భధారణ ఉన్న సాంకేతిక నిపుణులు గోపాల్ రత్న అవార్డుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కృత్రిమ గర్భధారణ కోసం కనీసం 90 రోజుల శిక్షణ తీసుకున్న వారికి ఈ అవకాశం ఉంది.
ఇది కాకుండా, రోజుకు 100 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే పాల ఉత్పత్తి కేంద్రాలవారు కూడా ఈ అవార్డు లభించే అర్హత ఉంటుంది. అయితే ఇందుకోసం కనీసం 50 మంది రైతులు వారి పాల కేంద్రంలో సభ్యులుగా ఉండాలనే షరతు పెట్టారు.
గోపాల్ రత్న అవార్డును కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం అందిస్తోంది. పశుసంవర్ధకంతో సంబంధం ఉన్న రైతులు దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గోపాల్ రత్న అవార్డు కోసం దరఖాస్తు చేసిన చివరి తేదీని 15 సెప్టెంబర్ 2021 గా నిర్ణయించారు. ప్రస్తుతం జూలై 15 నుండి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు గోపాల్ రత్న అవార్డు కోసం దరఖాస్తులు సమర్పించాలనుకుంటే, వారికి ఎలాంటి సమాచారం కావాలంటే, వారు ఈ లింక్ http://dahd.nic.in/ ని సందర్శించడం ద్వారా సమాచారం పొందవచ్చు.