Vocal for Local: మీ సెల్ఫీని ప్రధాని మోదీ పోస్ట్ చేస్తారు.. జస్ట్ ఇలా చేస్తే చాలు! త్రిప్తి దిమ్రి, మాధురి దీక్షిత్ కూడా..
కేంద్ర ప్రభుత్వం 'ఓకల్ ఫర్ లోకల్' ఉద్యమాన్ని ప్రారంభించింది. స్వదేశీ వస్తువులను, వ్యాపారులను ప్రోత్సహించడం, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం దీని లక్ష్యం. బాలీవుడ్ ప్రముఖులు ఇందులో భాగమయ్యారు. సామాన్యులు స్వదేశీ వస్తువులు కొని, వాటితో సెల్ఫీ తీసి నమో యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, ప్రధాని మోదీ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉంది.

స్వదేశీ వస్తువులను, స్వదేశీ వ్యాపారులను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఓకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. బాలీవుడ్ స్టార్స్‌తో యాడ్స్ రూపొందించింది. యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి, సీనియర్ నటి మాధురి దీక్షిత్, సింగర్ శంకర్ మహదేవన్ వంటి వాళ్లు కూడా ఈ క్యాంపెయిన్‌లో భాగం అయ్యారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో సతమతం అవుతున్న తరుణంలో మన దేశంలో తయారు అయ్యే వస్తువులను, వాటిని తయారు చేసే వారిని ప్రోత్సహిస్తూ ఓకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని చేపట్టారు.
అయితే ఈ క్యాంపెయిన్‌లో సామాన్యులను కూడా భాగం చేయనున్నారు. మీరు కూడా మన స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి వాటితో లేదా ఆ షాప్ యజమానితో ఒక సెల్ఫీ దిగి, ఆ సెల్ఫీని నమో యాప్‌లో అప్‌లోడ్ చేస్తే.. అందులో కొన్ని సెల్ఫీలను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయనున్నారు. ఏకంగా దేశ ప్రధాని సోషల్ మీడియా అకౌంట్లో మీ సెల్ఫీ పోస్ట్ అయ్యే అవకాశంతో పాటు.. మన స్వదేశీ వస్తువులకు సపోర్ట్ ఇవ్వొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన స్వదేశీ వస్తువులు కొనండి.. సెల్ఫీ అప్‌లోడ్ చేసేయండి.. ఓకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో భాగం అయిపోంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




