Viral Video: ఇంత అధ్వాన్నమా… మీ పిల్లలైతే ఇలాగే చూస్తరా?… పిల్లల భోజనం మేకలపాలు చేస్తరా?
ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది. స్కూళ్లలో డ్రాపౌట్లు తగ్గించేందుకు, పిల్లలకు పౌష్టికాహారం లోపం నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకొచ్చింది. అయితే కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలులో పరిశుభ్రత...

ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది. స్కూళ్లలో డ్రాపౌట్లు తగ్గించేందుకు, పిల్లలకు పౌష్టికాహారం లోపం నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకొచ్చింది. అయితే కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలులో పరిశుభ్రత లోపిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలోని ఒక అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలతో పాటు మేకలు కూడా తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రీ-నర్సరీ కేంద్రంలో పరిశుభ్రత, పర్యవేక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఈ సంఘటన గిరిజనులు అధికంగా ఉండే ధిమర్‌ఖేడా తహసీల్‌లోని కోఠి గ్రామంలోని సెహ్రా టోలాలో జరిగింది. ప్రభుత్వ పాఠశాల భవనం లేకపోవడంతో, అంగన్‌వాడీ కేంద్రం ఒక ప్రైవేట్, శిథిలావస్థలో ఉన్న భవనంలో నడుస్తోంది.
వైరల్ వీడియోలో పిల్లలు నేలపై కూర్చుని ఉండగా, వారి పక్కన ఉంచిన పళ్ళెల్లో మేకలు అదే ఆహారాన్ని తింటున్నట్లు కనిపిస్తుంది. వైరల్ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. పిల్లలు తినే ఆహారం పట్ల నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
मध्य प्रदेश के स्कूलों में बचपन से ही बच्चों को करुणा और पशु प्रेम सिखाया जाता है शायद तभी मिड डे मील बच्चों के साथ बकरियां भी कर रही हैं! pic.twitter.com/nTwU3gnoBi
— Anurag Dwary (@Anurag_Dwary) December 14, 2025
