CCTV Camera: యువతికి లిఫ్ట్ ఇచ్చాడు.. ట్రాఫిక్ చలానాతో భార్యకు అడ్డంగా దొరికిపోయాడు.. వివరాల్లోకి వెళ్తే..

|

May 11, 2023 | 8:37 AM

ఇడుక్కికి చెందిన టెక్స్‌టైల్ షాపు ఉద్యోగి  32 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 25న హెల్మెట్ ధరించకుండా నగరంలోని రోడ్లమీద తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై ప్రయాణించాడు. అయితే ఈ సమయంలో రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన కెమెరా అతని ఫోటోను తీసింది.

CCTV Camera: యువతికి లిఫ్ట్ ఇచ్చాడు.. ట్రాఫిక్ చలానాతో భార్యకు అడ్డంగా దొరికిపోయాడు.. వివరాల్లోకి వెళ్తే..
Kerala Man In Trouble
Follow us on

రోడ్డు భద్రత ప్రాజెక్టలో భాగంగా కేరళలో రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన సీసీకెమెరాలపై ఓ వైపు రాజకీయ దుమారం చెలరేగుతోంది.. మరోవైపు ఓ వ్యక్తి తన మహిళ స్నేహితురాలితో కలిసి ప్రయాణించడంతో తలనొప్పిని తెచ్చి పెట్టింది.. కేరళలోని రోడ్లపై ఏర్పాటు చేసిన రహదారి భద్రతా కెమెరాలు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు.. రాజధాని నగరంలో హెల్మెట్ ధరించకుండా తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై ప్రయాణించిన వ్యక్తికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఆ వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి.. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడంటూ.. అతనిని రోడ్డు పక్కన ఉన్న అత్యాధునిక కెమెరాలు బంధించాయి. అలా తీసిన ఫోటోతో పాటు.. మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ పంపిన వివరాలను అతని భార్య ఫోన్ నెంబర్ కు పంపించారు. దీంతో అతని కుటుంబంలో సమస్యలు తలెత్తాయి.. చినుకు, చినుకు గాలివాన అయినట్లు.. అతని గొడవ చివరకు పోలీసు కేసు.. అతని అరెస్టుకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే..

ఇడుక్కికి చెందిన టెక్స్‌టైల్ షాపు ఉద్యోగి  32 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 25న హెల్మెట్ ధరించకుండా నగరంలోని రోడ్లమీద తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై ప్రయాణించాడు. అయితే ఈ సమయంలో రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన కెమెరా అతని ఫోటోను తీసింది. అనంతరం.. అయితే ఆ ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ అతని భార్య పేరుతొ ఉంది. దీంతో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారం అతని భార్య .. వ్యక్తి చేసిన ట్రాఫిక్ ఉల్లంఘన వివరాలను,  జరిమానా చెల్లించాల్సిన వివరాలను ఆమె మొబైల్ ఫోన్‌కు మెసేజ్ చేశారు. మెసేజ్ ను చూసిన భార్య షాక్ తిన్నది. ఎందుకంటే భర్త బండి వెనుక వేరే మహిళ కూర్చుని ఉంది. ఇదే విషయంపై ఆ మహిళ ఎవరు అంటూ తన భర్తను ప్రశ్నించింది.

ఆమె భర్త.. తనకు ఆ మహిళతో ఎలాంటి సంబంధం లేదని.. అప్పుడు స్కూటర్‌పై లిఫ్ట్‌ ఇచ్చానని చెప్పాడు. అయినా భర్త చెప్పిన సమాధానం భార్య నమ్మలేదు. దంపతుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. తన భర్త తనను, తమ  కుమార్తె మూడేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. మే 5న ఇక్కడి కరమన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

భార్య చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. IPC 321 , 341 , 294  చట్టాలతో పాటు.. బాల్య న్యాయ చట్టంలోని సెక్షన్ 75  వంటి సెక్షన్ల కింద ఆమె భర్తపై కేసు పెట్టారు. అరెస్టు  చేశారు. అతడిని కోర్టులో హాజరు పరిచామని.. ఆ తర్వాత అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.

‘సేఫ్ కేరళ’లో భాగంగా రాష్ట్ర రహదారులపై కెమెరాల ఏర్పాటుపై కేరళలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలపై ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..