రియా చక్రవర్తిని 10 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ

| Edited By: Anil kumar poka

Aug 29, 2020 | 10:52 AM

సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని సీబీఐ శుక్రవారం 10 గంటలకు పైగా ప్రశ్నించింది. సుశాంత్ తో డేటింగ్, అతని తండ్రి రియాపై, ఆమె కుటుంబంపై చేసిన ఆరోపణలు, ఆర్తిక లావాదేవీలు తదితరాలపై అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు.

రియా చక్రవర్తిని 10 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ
Follow us on

సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని సీబీఐ శుక్రవారం 10 గంటలకు పైగా ప్రశ్నించింది. సుశాంత్ తో డేటింగ్, అతని తండ్రి రియాపై, ఆమె కుటుంబంపై చేసిన ఆరోపణలు, ఆర్తిక లావాదేవీలు తదితరాలపై అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. సుశాంత్ ని చివరిసారిగా ఎప్పుడు కలిసింది, అతని బ్యాంకు ఖాతా వివరాలను గురించి కూడా వారు గుచ్చి గుచ్చి అడిగారు. అయితే అన్ని ప్రశ్నలకు ఆమె తాను నిర్దోషినని, సుశాంత్, తాను మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అతని తండ్రి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని  కూడా సీబీఐ విచారించింది. రియాను మళ్ళీ శనివారం అధికారులు ఇంటరాగేట్ చేయనున్నారు.

రియా చక్రవర్తిని ప్రస్తుతం ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో,కూడా విచారిస్తున్నాయి. కాగా ఈ దర్యాప్తు సంస్థల ఇన్వెస్టిగేషన్ తోను, మీడియాలో వస్తున్న వార్తలతోను తాను విసుగెత్తిపోతున్నానని రియా వాపోయింది. సుశాంత్ మృతితో తనకెలాంటి సంబంధం లేదని చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడంలేదని అంటోంది.