IRCTC: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. దీపావళికి ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి..

మీరు దీపావళి రోజున ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'ట్రావెల్ నౌ పే లేటర్'ని ఉపయోగించి రైలులో సీటు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

IRCTC: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. దీపావళికి ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి..
Indian Railways
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 18, 2022 | 6:41 PM

రైల్వేను సామాన్యుల జీవితానికి ఆయువుపట్టుగా భావిస్తారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ ఇళ్లకు రైలులో ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో పండుగల సీజన్‌ నడుస్తోంది. ఈ సమయంలో పెద్దఎత్తున పట్టణాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ అనేక పండుగ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లలో రిజర్వేషన్ కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం పేరు ‘ట్రావెల్ నౌ పే లేటర్’.. దీని ద్వారా ఖాతాలో డబ్బు లేకుండా కూడా రైల్వే టిక్కెట్లను (రైల్వే టికెట్ బుకింగ్, టీఎన్పీఎల్) కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. మీరు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో కూడా ఈ సదుపాయాన్ని పొందుతారు. ‘ఇప్పుడు ప్రయాణించండి తర్వాత చెల్లించండి’

మీరు దీపావళి పండుగ రోజు ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఐఆర్‌సీటీసీ ‘ట్రావెల్ నౌ పే లేటర్’ని ఉపయోగించి రైలులో సీటును బుక్ చేసుకోవచ్చుచాలా సార్లు అత్యవసర పరిస్థితుల్లో టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ టికెట్ బుక్ చేసుకోవడానికి వారి వద్ద డబ్బు ఉండకపోవచ్చు.  

ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు ఎటువంటి ఖర్చు లేకుండా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు CASHe ద్వారా EMI ఎంపికను ఎంచుకోవచ్చు. దీని ద్వారా సులభంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ టిక్కెట్‌ను 3 నుంచి 6 నెలల ఈఎంఐని పెట్టుకునే అవకాశం ఉంది. ఈ సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైల్వే ప్రయాణికులు భారీ ప్రయోజనాలను పొందనున్నారు. విశేషమేమిటంటే, మీరు తత్కాల్, సాధారణ టిక్కెట్ బుకింగ్ రెండింటికీ కూడా ట్రావెల్ నౌ- పే లేటర్ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి మీకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు.

ట్రావెల్ నౌ- పే లేటర్ సౌకర్యంపై CASHe ఛైర్మన్‌ V. రమణ్ కుమార్ మాట్లాడుతూ.. ఐఆర్‌సీటీసీ ద్వారా దేశవ్యాప్తంగా  ‘ట్రావెల్ నౌ పే లేటర్’ సౌకర్యం ప్రారంభించినట్లుగా చెప్పారు. ఈ యాప్ ద్వారా ప్రతిరోజూ 15 లక్షల మంది టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. తర్వలోనే మరింత ఎక్కువ మందికి టీఎన్‌పీఎల్ సౌకర్యాన్ని అందించేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. CASHe తన ఆర్థిక సేవలను  టీఎన్‌పీఎల్ సేవ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని యోచిస్తోంది. దీనితో పాటు, తన ప్లాట్‌ఫారమ్‌ను భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ క్రెడిట్ ప్లాట్‌ఫామ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోంది.

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో ఇలాంటి టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా మీరు దీపావళి పండుగకు కుటుంబ సమేతంగా మీ ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ, మీరు వెంటనే రిజర్వేషన్ పొందకపోతే.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఐఆర్‌సీటీసీ Rail Connect యాప్ ద్వారా సులభంగా రిజర్వేషన్లు చేసుకోవచ్చు. దీని కోసం మీరు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఫోన్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత, కొన్ని సులభమైన దశలను అనుసరించి మీరు సులభంగా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ వద్ద బుకింగ్ కోసం డబ్బు లేకపోతే.. మీరు CASHe టీఎన్‌పీఎల్‌ను ఎంపిక ఎంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం టూర్ ప్లాన్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం