INS Vikrant: భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం INS విక్రాంత్ యుద్ధ నౌకను ప్రధాని నరేంద్ర మోదీ జలప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు. చాలా గర్వంగా ఉందని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నారు. ‘‘భారతదేశానికి ఒక చారిత్రాత్మక రోజు! నేను నిన్న INS విక్రాంత్‌లో ప్రయాణించినప్పుడు కలిగిన అనుభూతిని, గర్వాన్ని మాటల్లో చెప్పలేను.’’ అని క్యాప్షన్ పెట్టారు. అలాగే, ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధనౌక ప్రపంచ పటంలో భారత్‌ను ఉన్నతమైన స్థితిలో నిలుపుతుందన్నారు ప్రధాని మోదీ. దీని ద్వారా మనమిప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరామని సగర్వంగా ప్రకటించారు. బాహుబలి యుద్ధనౌకగా పేరున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్.. భారత్ కృషికీ, ప్రతిభకు నిలువుటద్దమని కొనియాడారు.
ఇదిలాఉంటే.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మొదటి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దీనిలో ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తీసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో కూడిన భారీ యుద్ధనౌక ఇది.
దాదాపు 45 వేల టన్నుల బరువుండే INS విక్రాంత్ నిర్మాణం కోసం 20 వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. ఒక్కసారి ఈ నౌకలో ఇంధనం నింపితే ఇది భారత తీరం మొత్తం రెండుసార్లు చుట్టిరాగలదు. షిప్‌లో 16,00 మంది సిబ్బంది ఉంటారు. గంటకు 51.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది INS విక్రాంత్. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఇందులో 16 పడకల ఆస్పత్రి కూడా ఉంది.
ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్స్ కారియర్స్ నిర్మించగల సామర్థ్యం ఉన్న ఆరవ దేశంగా అవతరించింది భారత్. ఇంతవరకూ ఈ క్రెడిట్ ఉన్న దేశాలు అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా మాత్రమే. ఇండియన్ నావీలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ కాకుండా మరో యుద్ధ విమాన వాహక నౌక ఉంది. నౌక నిర్మాణంలో అవసరమైన స్టీల్‌ను సెయిల్, డీఆర్‌డీఓ అందజేశాయి. ఇందులో ఉపయోగించిన విడిభాగాలు, సామగ్రిలో 76 శాతం మేడ్ ఇన్ ఇండియావే. దాదాపు 550 కంపెనీలు ఈ భారీ యుద్ధనౌక నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.
A historic day for India!
Words will not be able to describe the feeling of pride when I was on board INS Vikrant yesterday. pic.twitter.com/vBRCl308C9
— Narendra Modi (@narendramodi) September 3, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..