Doctor Murder Case: వైద్యురాలిపై హత్యాచారం.. కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు.. కీలక ఆదేశాలు..

Doctor's rape-murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా లేడీ డాకర్ట్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఆదివారం వరకు కోల్‌కతా పోలీసులకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డెడ్‌లైన్‌ విధించారు.

Doctor Murder Case: వైద్యురాలిపై హత్యాచారం.. కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు.. కీలక ఆదేశాలు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2024 | 12:53 PM

Doctor’s rape-murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా లేడీ డాకర్ట్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఆదివారం వరకు కోల్‌కతా పోలీసులకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డెడ్‌లైన్‌ విధించారు. అయితే దీదీ డెడ్‌లైన్‌ కంటే ముందే హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ ఆస్పత్రి ప్రిన్సిపల్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను వేరే మెడికల్‌ కాలేజ్‌ బదిలీ మీద పంపడం కాదు.. సెలవులపై వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. జూనియర్‌ డాక్టర్‌ హత్యను ఆస్పత్రి అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే .. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత కుటుంబసభ్యులకు ఫోన్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన ఉదయం నుంచి ఏం జరిగిందనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలో ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. వైద్యురాలిపై అత్యాచారం, హత్య గురించి ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశ్నించింది. ఎక్కువ సమయం వృధా చేస్తే, ఎక్కువ ఆధారాలు మాయమవుతాయని.. ఈ కేసులో అన్ని పత్రాలను సీబీఐకి అందజేయాలని ఆదేశించింది. సీబీఐ వెంటనే ఈ దర్యాప్తును ప్రారంభిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కేసు పత్రాలను ఈరోజు ఇంటిలిజెన్స్ అధికారులు స్వయంగా సేకరించనున్నారు.

నిందితుడు సంజయ్‌రాయ్‌ కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ను అతి కిరాతకంగా రేప్‌ చేసి చంపేశాడు. హాస్పిటల్‌ సెమినార్‌ హాల్లో లేడీ డాక్టర్‌ను పాశవికంగా అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించారు. ఢిల్లీ ఎయిమ్స్‌ , లక్నోలో వైద్యులు ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. ..నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..