Watch Video: ఆఫ్టరాల్ కాఫీ కప్పు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కేఫ్ సిబ్బందిపై దాడికి దిగారు. తన్నుతూ, గుద్దుతూ సిబ్బందిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో అక్కడున్నవారంత భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అదొక రద్దీ ప్రాంతం. అక్కడ ఒక కేఫ్ ఉంది.. సాయంత్రం కావడంతో కస్టమర్ల హడావుడి ఎక్కువైంది. హాయిగా కాఫీ తాగుతూ ఎవరి ముచ్చట్లలో వారు పడ్డారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద గొడవ మొదలైంది. ఇద్దరు వ్యక్తులు కేఫ్ సిబ్బందిపై దాడికి దిగారు. పిడి గుద్దులు గుద్దుతూ.. తన్నుతూ తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ గా మారింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిన్న కాఫీ కప్పు పెద్ద గొడవకు కారణమైంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాపు చాలా పాపులర్. బుధవారం సాయంత్రం ఈ షాపుకు నలుగురు వ్యక్తులు కాఫీ తాగడానికి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ వివాదం మొదలైంది. కాఫీ ఆర్డర్ ఇచ్చాక.. వారిలో ఒకరు ఎక్స్ ట్రా కప్పు కావాలని సిబ్బందిని అడిగారు. దీనికి సిబ్బంది నిరాకరించారు. రూల్స్ ఒప్పుకోవని.. కావాలంటే మరో కాఫీ కొనాలని సూచించారు. మాకే ఇంకో కప్పు ఇయ్యవా.. పైగా ఇంకోటి కొనమని చెప్తావా అంటూ సిబ్బందిని తిడుతూ దాడికి దిగారు. కప్పు ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తిని బయటకు లాక్కొచ్చి తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఈ దాడి మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దాడి చేసిన వారిపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి.
Fight for “By-Two” coffee gets ugly in Bengaluru , 4 men thrash a staffer at the Namma Filter Coffee outlet in Sheshadripuram for refusing to give an additional cup. The staffer informed them it was against their policy, they continued to insist & eventually assaulted him. pic.twitter.com/9W9X27Bp8z
— Deepak Bopanna (@dpkBopanna) July 3, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి