Delhi Building Collapses: ఢిల్లీలోని బవానా (Delhi’s Bawana) లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నరేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే కాలనీలో శిథిలావస్థకు చేరిన భవనం కుప్పకూలి నలుగురు మరణించారు. మృతుల్లో 9 ఏళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు మహిళలను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతులను రుకయ్య ఖాతున్, షాజాద్, అఫ్రీనా (9), డానిష్‌లుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. భవనం కుప్పకూలిన (Building Collapses) ప్రాంతంలో దాదాపు సహాయక చర్యలు ముగిశాయని (Delhi) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) బ్రిజేందర్ కుమార్ యాదవ్ తెలిపారు.
జల్ మండలి భవనం సమీపంలో శిథిలావస్థకు చేరిన భవనం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భవనం కూలీపోగా.. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మూడు జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. కూలిపోయిన ఈ భవనం రాజీవ్ రతన్ ఆవాస్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ భవనంలో దాదాపు 300 నుంచి 400 వరకు ప్లాట్లు ఉన్నాయని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: