AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Jobs: కిస్మత్ అంటే ఈమెదే.. 50 ఇంట‌ర్వ్యూల‌లో ఫెయిల్.. చివ‌ర‌కు రూ. కోటి ప్యాకేజీతో జాబ్ కొట్టింది..!

Google Jobs: సంప్రీతి యాదవ్‌ వయస్సు 24 ఏళ్లే. కానీ.. ఏకంగా గూగుల్‌లో కోటి రూపాయ‌ల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టేసింది. అంతకు ముందు 50 ఇంట‌ర్వ్యూల‌లో ఫెయిల్ అయింది.

Google Jobs: కిస్మత్ అంటే ఈమెదే.. 50 ఇంట‌ర్వ్యూల‌లో ఫెయిల్.. చివ‌ర‌కు రూ. కోటి ప్యాకేజీతో జాబ్ కొట్టింది..!
Shiva Prajapati
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 12, 2022 | 12:20 PM

Share

Google Jobs: సంప్రీతి యాదవ్‌ వయస్సు 24 ఏళ్లే. కానీ.. ఏకంగా గూగుల్‌లో కోటి రూపాయ‌ల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టేసింది. అంతకు ముందు 50 ఇంట‌ర్వ్యూల‌లో ఫెయిల్ అయింది. అయినా కూడా తన సంక‌ల్పాన్ని మాత్రం వ‌ద‌ల్లేదు. రూ. 1.10 కోట్ల ప్యాకేజ్‌తో లండ‌న్‌లో ఉన్న గూగుల్ ఆఫీసుకు సెలెక్ట్ అయింది. జాబ్ వచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ.. తాజాగా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను తాజాగా మీడియాకు వెల్లడించింది.

‘‘ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లిన‌ప్పుడు చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ.. నాకు త‌ల్లిదండ్రులు, క్లోజ్ ఫ్రెండ్స్ తోడున్నారు. వాళ్లే న‌న్ను ఎంక‌రేజ్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీల గురించి తెలుసుకోవ‌డం కోసం చాలా స‌మ‌యం గడిపాను. ఆ కంపెనీల‌లో ఇంట‌ర్వ్యూ అంటే అది ఒక డిస్కష‌న్‌లాగానే ఉంటుంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయ‌డం నాకు ఇంట‌ర్వ్యూల‌లో కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది. దాదాపు 50 ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయ్యాను. చివరికి సక్సెస్ అయ్యాను.’’ అని యాద‌వ్ చెప్పుకొచ్చింది.

ఇక 2021లో ఢిల్లీ టెక్నోలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి బీటెక్ ప‌ట్టా పొందిన సంప్రీతి యాద‌వ్‌.. సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ట్రై చేయ‌డానికి ముందు కంటెంట్ క్రియేట‌ర్ కావాల‌ని అనుకుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంప్రీతికి క్లాసిక‌ల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సంప్రీతి తండ్రి ఎస్‌బీఐ బ్యాంక్‌లో ప‌ని చేస్తుంటారు. త‌న త‌ల్లి ప్రభుత్వ ఉద్యోగిని.

Also read:

Corona Test: ఇంట్లో కరోనా టెస్ట్‌ చేస్తున్నారా?.. అయితే, ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

IPL 2022 Auction: కేకేఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. వేలంలో ఈ 5గురు సొంతమయ్యేనా?