Assistant Professor jobs: పీహెచ్‌డీ చేశారా? నెలకు లక్ష జీతంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (TISS) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor Posts)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Assistant Professor jobs: పీహెచ్‌డీ చేశారా? నెలకు లక్ష జీతంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Tiss
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2022 | 7:21 PM

TISS Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (TISS) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor Posts)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.1,00,598ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయస్సు ఫిబ్రవరి 9, 2022 నాటికి 62 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నెట్‌ లేదా సెట్‌ లేదా స్లెట్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూ అభ్యర్ధులకు: రూ.250
  • ఇతర అభ్యర్ధులకు: రూ.1000

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CIL Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో కోల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. డిగ్రీ చేసిన వారికి అవకాశం..