రాయ్‌గఢ్‌ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్‌లో ట్వీట్లు చేశారు. ఈ ప్రమాద వార్త తమను కలచి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు..

రాయ్‌గఢ్‌ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2020 | 12:36 PM

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్‌లో ట్వీట్లు చేశారు. ఈ ప్రమాద వార్త తమను కలచి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి, ప్రధాని తెలిపారు. అలాగే ప్రమాద స్థలంలో ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారని, బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. అలాగే మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ప్రమాదం స్థలంలో సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మ‌రో 18 మంది చిక్కుకుని ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు అంటున్నారు.

Read More:

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి.. 2.38 కోట్లకి చేరిన కేసులు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది