‘భేషైన విజన్ ఉన్న బడ్జెట్ ఇది’.. ప్రధాని మోదీ
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రధాని మోదీ.. విజన్ ఉన్న భేషయిన బడ్జెట్ గా అభివర్ణించారు. ‘ మినిమం గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ ‘ అన్న అంశానికి ప్రాధాన్యమిచ్చినందుకు ఆయన నిర్మలా సీతారామన్‌ను అభినందించారు. ఈ బడ్జెట్లో ఓ కార్యాచరణ ఉందన్నారు. ఉపాధికల్పన, వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం, టెక్స్ టైల్స్, టెక్నాలజీ వంటి ప్రధాన రంగాలకు ఊతమిచ్చారని, ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ పెంచాలంటే ఈ నాలుగు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. యువతకు […]
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రధాని మోదీ.. విజన్ ఉన్న భేషయిన బడ్జెట్ గా అభివర్ణించారు. ‘ మినిమం గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ ‘ అన్న అంశానికి ప్రాధాన్యమిచ్చినందుకు ఆయన నిర్మలా సీతారామన్‌ను అభినందించారు. ఈ బడ్జెట్లో ఓ కార్యాచరణ ఉందన్నారు. ఉపాధికల్పన, వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం, టెక్స్ టైల్స్, టెక్నాలజీ వంటి ప్రధాన రంగాలకు ఊతమిచ్చారని, ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ పెంచాలంటే ఈ నాలుగు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. యువతకు సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ కీలకమైనది.. నవ భారతావని అభివృద్దికి ఇదే అవసరం.. అని పేర్కొన్న ఆయన.. ఈ బడ్జెట్లో ప్రకటించిన సంస్కరణలు ఉపాధి అవకాశాలను పెంచుతాయని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు ఇవి దోహదపడతాయని అన్నారు. దేశంలో 100 విమానాశ్రయాలను అభివృధ్ది చేయాలన్న లక్ష్యం టూరిజం రంగానికి ఊతమిస్తుందని, తక్కువ పెట్టుబడితో ఆదాయం పెంచుకోవడానికి, ఉపాధికల్పనకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.