Budget 2024: ‘రెండు రాష్ట్రాలకే వడ్డించారు’.. బడ్జెట్‌పై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం..

|

Jul 24, 2024 | 11:41 PM

కేంద్ర బడ్జెట్‌పై అధికార , విపక్షాల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌, తృణమూల్‌, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. రాజ్యభలో కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే. రెండు రాష్ట్రాలకు మాత్రమే వడ్డించి మిగతా రాష్ట్రాలను విస్మరించారని అన్నారు.

Budget 2024: ‘రెండు రాష్ట్రాలకే వడ్డించారు’.. బడ్జెట్‌పై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం..
Nirmala Sitharaman, Mallikarjun Kharge
Follow us on

కేంద్ర బడ్జెట్‌పై అధికార , విపక్షాల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌, తృణమూల్‌, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. రాజ్యభలో కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే. రెండు రాష్ట్రాలకు మాత్రమే వడ్డించి మిగతా రాష్ట్రాలను విస్మరించారని అన్నారు. మాతాజీ మాట్లాడడంలో దిట్ట అంటూ ఖర్గే నిర్మలపై సెటైర్లు వేశారు. అందరి ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు ప్లేట్లలో మాత్రం పకోడి , జిలేబీ వడ్డించారు. తమిళనాడు, కేరళ , కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌తో పాటు ఢిల్లీ , ఒడిశాకు ఏమి ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. ఇలాంటి బడ్జెట్‌ తానెప్పుడు చూడలేదని.. కొందరిని సంతోషపెట్టడానికి , కుర్చీని కాపాడుకోవడానికి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ విమర్శలు సంధించారు. ఖర్గే వ్యాఖ్యలకు ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇవ్వడానికి సిద్దం కాగానే సభ నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు.

ఖర్గే వ్యాఖ్యలకు నిర్మల కౌంటర్‌..

ఖర్గే వ్యాఖ్యలకు నిర్మల కౌంటరిచ్చారు. ప్రతి రాష్ట్రానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయన్న విషయం అందరికి తెలుసన్నారు. కావాలనే వివిధ రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించామో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క చెప్పాం.. కావాలనే కాంగ్రెస్‌తో సహా విపక్షాలు దీనిపై రాద్దాంతం చేస్తున్నాయంటూ పేర్కొన్నారు. రాష్ట్రాలకు కేటాయింపులు జరగలేదని తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలకే నిధులు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టన బడ్జెట్‌ల్లో ప్రతి రాష్ట్రం పేరును ప్రస్తావించారా ? సమాధానం చెప్పాలి .. అంటూ నిర్మలా సీతారామన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.

పార్లమెంట్ బయట కూడా కేంద్ర బడ్జెట్‌పై ఇండియా కూటమి ఆందోళనలు చేపట్టింది. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో పాటు విపక్ష ఎంపీలు మకరద్వార్‌ జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..