సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం.. సంచిలో నిషేధిత వస్తువులు.. అధికారులు అప్రమత్తం
పంజాబ్(Punjab)లోని పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. ఫిరోజ్పుర్సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చి వేసింది. డ్రోన్(Drone) లో నిషేధిత వస్తువులు...
పంజాబ్(Punjab)లోని పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. ఫిరోజ్పుర్సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చి వేసింది. డ్రోన్(Drone) లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో డ్రోన్ శబ్దానికి అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్‌కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు రంగు ప్యాకెట్ఉన్నాయని వెల్లడించారు. జమ్ముకశ్మీర్(Jammu-Kashmir)లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనగర్‌లోని అమిరా కడల్ ప్రాంతంలో ఆదివారం జరిగిన గ్రెనేడ్ దాడిలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఈ ఘటనలో 23 మంది పౌరులు సహా ఓ పోలీసు గాయపడ్డారు. గాయపడిన ఓ పౌరుడు చికిత్స పొందుతూ ఆదివారమే మృతిచెందాడు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. నేరస్థులను అరెస్టు చేయడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు శనివారం భారత సరిహద్దు ప్రాంతంలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా బిజనోర్ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో డ్రోన్లు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది పాకిస్థాన్ చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా నిందితులు డ్రగ్స్, బాంబులు వంటివి ఆ ప్రాంతానికి చేరవేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
Also Read
పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితిని ఇలా అంచనా వేయండి..
Fuel Prices: మళ్లీ పెట్రో బాంబ్.. బాదుడే బాదుడు.. సామాన్యుడిపై మోయలేని భారం..