Viral: పచ్చని పెళ్లిపందిట్లో పెళ్లికూతురు ఇచ్చిన షాక్.. ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అందరి మైండ్ బ్లాంక్

పచ్చని పెళ్లిపందిట్లో ఓ పెళ్లికూతురు ఇచ్చిన షాక్ ఇది. సరిగ్గా తాళికట్టే సమయానికి పెళ్లిపీటలపైనే స్పృహతప్పి పడిపోయిందామె. అంతా కంగారు పడుతున్న టైమ్‌లో ఇక్కడే మరో ట్విస్ట్ కూడా కనిపించింది.

Viral: పచ్చని పెళ్లిపందిట్లో పెళ్లికూతురు ఇచ్చిన షాక్.. ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అందరి మైండ్ బ్లాంక్
Marriage Last Minute Twist
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2022 | 7:04 PM

Karnataka: కర్ణాటకలోని మైసూరు(Mysore)లో ఓ పెళ్లి కూతురు పెద్ద హైడ్రామా క్రియేట్ చేసింది. విద్యాభారతి కళ్యాణమండంపంలో రవికుమార్, సించనా పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరో పక్క ఘుమఘుమలాడే వంటకాలు రెడీ అవుతున్నాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాలు సిద్ధంగా ఉన్నాయి. చుట్టాలంతా హడావుడి చేస్తున్నారు. వధూవరులిద్దరూ.. ముస్తాబై పీఠల మీదకు వచ్చారు. వేద పండితుల మంత్రాలు.. పెళ్లికి వచ్చిన బంధువులతో మండపమంతా కళకళలాడుతోంది. కానీ ఇంతలో ఉన్నపళంగా పెళ్లి కూతురు కింద పడిపోయింది. ఏదో ఆరోగ్యో సమస్య అనుకుని సపర్యలు మొదలు పెట్టారు. కాసేపటి తర్వాత పెళ్లికూతురు సించనా సాధారణ స్థితికి వచ్చింది. పెద్ద ముప్పే తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని నిముషాల్లోనే మరో ట్విస్ట్. పెళ్లి కొడుకు కుటుంబం తయారు చేయించిన కొన్ని నగలు.. పెళ్లి కూతురు ఒంటిపై కనిపించలేదు. ఈ విషయంపై ఆరా తీస్తే వధువుతో పాటు ఆమె కుటుంబసభ్యులు బుకాయించారు. పెళ్లి మండపంలో పెద్ద రచ్చే అయింది. ఒకానొక స్టేజిలో పెళ్లి ఆగిపోతుందనేలా అక్కడ సీన్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఇరువర్గాల పెద్దలు సర్దిచెప్పడంతో మళ్లీ వధూవరులు పీటల మీదకు వచ్చారు. పూజారి మంత్రాలు అందుకున్నారు.

కొన్ని నిముషాలు కళ్లు మూసుకుంటే పెళ్లి అయిపోతుంది. జీలకర్ర బెల్లం పెట్టే టైమ్ వచ్చేసింది. ఇక్కడ పెళ్లి కూతురు ఇచ్చిన షాక్‌కి ఇప్పటికీ పెళ్లికొడుకు, అతని బంధువులు తేరుకోలేకపోతున్నారు. ఈ సారి ఏకంగా సించనా పెళ్లి పీటల మీద నుంచి లేచి బయటికి వెళ్లిపోయింది. పెళ్లి ఇష్టం లేదంటూ అక్కడ నుంచి వచ్చేసింది. ఈ ఘటనతో ఏం జరుగుతుందో అర్ధం కాక పెళ్లికి వచ్చిన వాళ్లు అయోమయంలో ఉన్నారు. ప్రియుడి కోసం పెద్దలు కుదిర్చిన పెళ్లిని పీటల మీదే పెటాకులు చేసిందా వధువు. సీన్ కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారంటూ తల్లిదండ్రులకే చివాట్లు పెట్టారు. ఈ పెళ్లికూతురు వ్యవహారంపై కొంతమంది తీవ్రంగా మండిపడుతున్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ.. పీటల మీదకు ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తే ఇలా చేయడమేంటని వరుడి తరుపు బంధువులు నిలదీస్తున్నారు.