Wedding Day: పెళ్లి వేడుకలో హై డ్రామా.. వరుడిని చూసి వధువు షాక్.. నల్లగా ఉన్నాడని నో అన్న పెళ్లికూతురు

|

May 18, 2023 | 9:37 AM

తనకంటే పెళ్ళికొడుకు వయసులో పెద్దగా ఉన్నాడు.. నల్లగా ఉన్నాడు తాను పెళ్లి చేసుకోనని పెళ్ళికి నో చెప్పింది. వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు విషయంలో చాలా అబద్ధాలు చెప్పారని ఆరోపించింది. వేదికపై వధువు కిట్టు కుమారి వేదికపై వరుడి మెడలో జయమాల వేసి తిలకం దిద్దడానికి  నిరాకరించింది. నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. 

Wedding Day: పెళ్లి వేడుకలో హై డ్రామా.. వరుడిని చూసి వధువు  షాక్.. నల్లగా ఉన్నాడని నో అన్న పెళ్లికూతురు
Bride Refused To Marry
Follow us on

ఎంతో సంతోషంగా పెళ్లి కోసం ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికొడుక్కి షాక్ ఇస్తూ పెళ్లికూతురు పెళ్ళికి నో చెప్పింది. పెళ్ళికి ఒప్పించేందుకు అతిధులు, పెళ్ళికొడుకు తండ్రి ఎంతగా ప్రయత్నించినా ఒప్పుకోకపోవడంతో చేసేది ఏమి లేక.. పెళ్లిమండపం నుంచి పెళ్లి కొడుకు సహా బంధువులు తిరుగుబాట పట్టారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఈ ఘటన కహల్‌గావ్‌లోని రసల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వినోద్ మండల్ కుమార్తె కిట్టు కుమారి ధనౌరా నివాసి డాక్టర్ వీరేంద్ర సింగ్ కుమారుడు నీలేష్ కుమార్ సింగ్‌తో వివాహం జరగాల్సి ఉంది. కిట్టూ కుమారి పెళ్లికూతురు అలంకారంలో వేదిక వద్ద  పెళ్లికోసం రెడీగా ఉంది. కొంచెం సేపట్లో వరమాల వేయాల్సి ఉండగా.. తాను ఈ పెళ్ళికి చేసుకోను అంటూ నో చెప్పి షాక్ ఇచ్చింది. తనకంటే పెళ్ళికొడుకు వయసులో పెద్దగా ఉన్నాడు.. నల్లగా ఉన్నాడు తాను పెళ్లి చేసుకోనని పెళ్ళికి నో చెప్పింది. వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు విషయంలో చాలా అబద్ధాలు చెప్పారని ఆరోపించింది. వేదికపై వధువు కిట్టు కుమారి వేదికపై వరుడి మెడలో జయమాల వేసి తిలకం దిద్దడానికి  నిరాకరించింది. నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని చెప్పింది.

జయమాల వేదికపై మొబైల్‌లో పెళ్లి వేడుకను వీడియో తీస్తున్న వ్యక్తులు అకస్మాత్తుగా వరుడు మేడలో  పూలమాల వేయడానికి వధువు నిరాకరించడం చూశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఊరేగింపుగా వచ్చిన వరుడు వివాహ వేదికపైకి వచ్చాక.. అతణ్ని చూడగానే యువతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వరుడి మెడలో జయమాల వేయడానికి నిరాకరించింది. పెళ్ళికొడుకు తండ్రి,  కుటుంబసభ్యులు పెళ్ళికూతురికి నచ్చ చెప్పేందుకు.. పెళ్లికి ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వధువుకు అనేక హామీలు ఇచ్చారు. ముకుళిత హస్తాలతో వేడుకున్నా వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయినా పెళ్లికూతురు పెళ్లిచేసుకోను అంటూ మొండికేసింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..