AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRICS-2026: మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసిన వేళ.. ఒక్క ఫొటో.. ఎన్నో సంకేతాలు!

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత దౌత్యం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ముగ్గురూ కలిసి కనిపించిన దృశ్యం.. బ్రిక్స్‌లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా రాజకీయ, దౌత్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

BRICS-2026: మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసిన వేళ.. ఒక్క ఫొటో.. ఎన్నో సంకేతాలు!
Pm Modi, Vladmir Putin And Xi Jinping
Balaraju Goud
|

Updated on: Sep 12, 2026 | 6:36 PM

Share

న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత దౌత్యం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ముగ్గురూ కలిసి కనిపించిన దృశ్యం.. బ్రిక్స్‌లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా రాజకీయ, దౌత్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మోదీ-పుతిన్-జిన్‌పింగ్ మధ్య జరిగిన తాజా భేటీ.. గత మూడేళ్లలో ఈ ముగ్గురు నేతలు కలిసి కనిపించిన మూడో సందర్భంగా నిలిచింది. మరో ఫొటోలో మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో మాట్లాడుతుండగా, పుతిన్ ఆయన పక్కనే కనిపించారు. మరో చిత్రంలో మోదీ, పుతిన్ కలిసి నడుస్తూ నవ్వుతున్న దృశ్యం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బ్రిక్స్‌లో పెరుగుతున్న వైవిధ్యం

బ్రిక్స్ విస్తరణ తర్వాత కూటమిలో సభ్య దేశాల సంఖ్య, వాటి భౌగోళిక పరిధి, రాజకీయ ప్రయోజనాలు మరింత విస్తరించాయి. ఇరాన్, యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా వంటి దేశాల చేరికతో బ్రిక్స్ ఇప్పుడు మరింత సంక్లిష్టమైన దౌత్య వేదికగా మారింది. ఒకవైపు రష్యా, చైనాతో భారత్‌కు వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతుండగా.. మరోవైపు పశ్చిమ దేశాలతో కూడా భారత్ తన భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది.

ఇరాన్-సౌదీ-యూఏఈ మధ్య ఏకాభిప్రాయం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను ఒకే వేదికపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం భారత్‌కు పెద్ద దౌత్య సవాలుగా మారింది. ముఖ్యంగా ప్రాంతీయ విభేదాలు, భద్రతా సమస్యలు, ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలకు సంబంధించిన అంశాలపై సభ్య దేశాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ, విస్తృత చర్చల అనంతరం బ్రిక్స్ దేశాలు ఉమ్మడి అవగాహనకు రావడం భారత్ అధ్యక్షతకు కీలక విజయంగా భావిస్తున్నారు. సభ్య దేశాల మధ్య విభేదాలను తగ్గించేందుకు భారత ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ప్రపంచ సంక్షోభాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య-సుంకాల విధానాల ప్రభావం వంటి పరిణామాల మధ్య ఈ బ్రిక్స్ సమావేశం జరిగింది. అందుకే ఈ సదస్సు కేవలం సభ్య దేశాల సమావేశంగానే కాకుండా.. మారుతున్న ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలకు కీలక వేదికగా మారింది. భారత్ అధ్యక్షతన “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్‌ఓ తదితర అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా పాల్గొన్నారు.

మొత్తంగా చూస్తే.. బ్రిక్స్ విస్తరణ తర్వాత ఏర్పడిన కొత్త సమీకరణాల మధ్య భారత్ తన దౌత్య సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. విభిన్న ప్రయోజనాలు, ప్రాంతీయ విభేదాలు ఉన్న దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా న్యూఢిల్లీ తన ‘సమ్మిళిత దౌత్యం’ను ముందుకు తీసుకెళ్లినట్లు ఈ శిఖరాగ్ర సమావేశం స్పష్టం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us